ఏంటీ ఇనాయా నాగార్జున పరమ వేస్టా... అంతమాట అనేశావు!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

గత మూడు సీజన్లో నుంచి నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.

ఈయన షో చూడకుండా కేవలం బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్ పరంగా అక్కడ కంటెస్టెంట్లతో మాట్లాడుతారని తప్పు ఒప్పుల గురించి పట్టించుకోరు అంటూ ఎన్నోసార్లు ఈయన పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

తాజాగా సీజన్ సిక్స్ ముగుస్తున్న నేపథ్యంలో నాగార్జున వ్యవహార శైలి పై మరోసారి విమర్శలు వస్తున్నాయి.

నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకోవడం మంచిది అంటూ పలువురు భావిస్తున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో చాలామంది స్ట్రాంగ్ కాంటెస్టెంట్లు అన్ ఫైర్ ఎలిమినేషన్ జరిగిందని నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇక 14వ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఇనయా సైతం బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముందుగా కంటెస్టెంట్ రేవంత్ గురించి మాట్లాడుతూ ఆయన మనుషుల అభిప్రాయాలను వారి మనోభావాలను పట్టించుకోరని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారని ఈమె తెలిపారు.

"""/"/ టాస్క్ గెలవడం కోసం అవతలి వారి పెయిన్ తనకు పట్టదని, కనీసం అమ్మాయిలనీ చూడకుండా టాస్కులలో బల ప్రదర్శన చూపిస్తారని ఈమె వెల్లడించారు.

టాస్కులలో తాను ఓడిపోతే పెద్ద ఎత్తున బూతు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇలా రేవంత్ వ్యవహరించినప్పటికీ నాగార్జున గారు మాత్రం వచ్చి రాగానే తనని పొగుడుతారని ఇనయ నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక నాగార్జున హోస్ట్ గా పరమ వేస్ట్ అంటూ నాగార్జున పట్ల కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Bourbon Larchambault : Vue D’ensemble Et Fonctionnalités Pour Les Débutants