జెస్సికి సీక్రెట్ టాస్క్.. సన్నితో దారుణమైన గొడవలు.. కారణం అదే?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, పోట్లాటలు, ప్రేమానురాగాలు ఇలా ఎప్పుడు ఎవరి మధ్య ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

అప్పటి వరకు ఎంతో కలిసిమెలిసి ఉండే కంటెస్టెంట్ లు కూడా ఉన్నఫలంగా శత్రువులుగా మారిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటున్నారు.తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బంగారు కోడిపెట్ట టాస్క్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ టాస్క్ లో గెలవడం కోసం ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ ఎంతో కష్టపడుతున్నారు.

ఇకపోతే ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ టాస్క్ లో భాగంగా ఎవరివైనా ముగ్గురు గుడ్లను దొంగతనం చేస్తే తనకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు.

అయితే ఈ టాస్క్ లో భాగంగా ఎవరైనా సహాయం తీసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో జెస్సి సిరి హెల్ప్ తీసుకున్నారు.

ఇలా సీక్రెట్ టాస్క్ లో భాగంగా జెస్సీ సన్నీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

కావాలనే సన్నీని రెచ్చగొడుతూ అతనితో గొడవకు దిగారు.అయితే ఇది సీక్రెట్ టాస్క్ అని తెలియని సన్నీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

"""/"/ ఈ టాస్క్ లో భాగంగా సిరి కూడా సన్నీతో గొడవ పడుతూ నీకెందుకురా అంటూ మాట్లాడుతుంది.

రా అన్నావంటే బాగోదు నీకు ఆ అర్హత లేదని సన్నీ అనడంతో అర్హత ఏంటి అంటూ వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంటుంది.

ఇకపోతే బిగ్ బాస్ ఇదొక సీక్రెట్ టాస్క్ అని అసలు విషయం చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ షాక్ అయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న షణ్ముక్ అప్పుడప్పుడు నాకు కూడా సీక్రెట్ ఇవ్వండి బిగ్ బాస్ అని అనడంతో వెంటనే రవి ముందు టాస్క్ ఆడురా అంటూ సెటైర్ వేశాడు.

మరి ఈ సీక్రెట్ టాస్క్ లో జెస్సీ విజయం సాధించాడా లేదా అనే విషయం నేటి ఎపిసోడ్ లో తెలియనుంది.

US Airport : యూఎస్ ఎయిర్‌పోర్ట్‌లోని ఈ బ్యాగేజీల గజిబిజి చూశారా.. వీడియో వైరల్..