బిగ్ బాస్ 5 లో స్టార్ సింగర్ ఫిక్స్.. ఎవరంటే?

బుల్లితెరలో త్వరలో ప్రసారం కానున్న.రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కోసం బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్ లను పూర్తి చేసుకోగా త్వరలోనే సీజన్ 5 ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ షో గురించి ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక అప్ డేట్ వినిపిస్తూనే ఉంది.

ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ఓ స్టార్ సింగర్ పాల్గొననున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ప్రసారమైన గత సీజన్ లలో సింగర్ లను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

అందులో గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్, రోనాల్డ్, మధుప్రియ లను తీసుకోగా ఈ సీజన్ కు సింగర్ రామచంద్రను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈయన తన పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకొని స్టార్ సింగర్ గా నిలిచాడు.

ఈయన 2010లో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకొని ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు.

ఇక ఈయన సీజన్ 5 లో అడుగు పెడితే మాత్రం తన పాటలతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటాడు.

ఇక ఈసారి ఈ షో భారీ బడ్జెట్ తో ప్రసారం కానుంది.ఎప్పటిలాగానే బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్స్, యాంకర్లను తీసుకున్నారు.

ప్రస్తుతం ఈ సీజన్ హౌస్ సెట్టింగ్ కూడా పూర్తవగా ఇటీవలే ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయింది.

ఈసారి కూడా స్టార్ హీరో నాగార్జున హోస్టింగ్ చేయనున్నాడు.మరో బోల్డ్ బ్యూటీ అరియానా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు గతంలో తెలిసింది.

ఇక ఈ సారి పలు జాగ్రత్తలతో ప్రారంభించనునట్లు గతంలో తెలిపారు.

త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ… రేసులో ఉంది వీరే ?