దుబాయ్ లో చార్టెడ్ ఫ్లైట్, అపార్ట్మెంట్లు.. అబ్బో హామీదా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ రోజురోజుకు రసవత్తరంగా కొనసాగుతోంది.కాగా ఇటీవలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హమీదా సరదాగా కొన్ని ముచ్చట్లు ఇంటర్వ్యూలో పంచుకుంది.

హమీదా అంటే ఎవరు అని తెలియడానికి పోర్ట్ పోలియో చేయించుకున్నాను అని స్వయానా ఆమె నోటితోనే చెప్పారు.

దాన్ని పంపించిన తర్వాత తన మేనేజర్ వచ్చి ఇలా ఒక షో ఉందని తనకు చెప్పినట్టు హమీదా తెలిపారు.

అది ఏం షో అంటే అదే బిగ్ బాస్ అని ఆయన చెప్పినట్టు ఆమె అన్నారు.

ఇక బిగ్ బాస్ నుంచి పిలుపు రాగానే చాలా ఎక్సైట్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

అప్పటివరకు తనకొక ఫీలింగ్ ఉండేదని అది ఎలా అంటే బిగ్ బాస్ అంటే ఎప్పటి నుంచో సెలబ్రిటీలగా ఉన్నవాళ్లు మాత్రమే ఆ షో వెళ్తారనుకునేదాన్ని అని హమీదా చెప్పారు.

"""/"/ నిజానికి తాను ఏదైనా సినిమాల్లో అవకాశం వస్తుందేమోనని అలా ఫోటోషూట్ చేయించుకున్నాను అని చెప్పారు దాన్ని చూడగానే ఇలా ఆ షో నుంచి పిలుపు వచ్చిందని ఆమె అన్నారు నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని ఆమె అన్నారు.

ఒకవేళ తాను సినిమా చేసినా కూడా హమీద ఏంటో తెలియక పోయేదని బిగ్ బాస్ కి వెళ్ళాను కాబట్టి హమీద ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

దానికిగాను బిగ్ బాస్ కు స్టార్ మాకు నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆమె చెప్పారు.

"""/"/ హమీదాకు దుబాయిలో పెద్దపెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని, చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయని వస్తున్న వార్తలపై స్పందించిన ఆమె, నిజంగా అలా చూపిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

నిజంగా తన ఫ్యాన్స్ కి తనని అలా చూడాలని ఉందేమో అని, అది తొందర్లోనే నెరవేరాలని తాను కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో త్రప్తి డిమ్రి కి పెరుగుతున్న క్రేజ్…తన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?