శ్రీరామ్ కు హామీద బానిస.. టార్గెట్ చేసిన షన్ను, సిరి?

బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది.ఇప్పటికి నాలుగు వారాలు పూర్తి చేసుకొని నలుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా, తాజాగా ఐదవ భాగం పూర్తి చేసుకోనుంది.

ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి హమీద ఎలిమినేట్ అవుతుందనే విషయం వినపడుతోంది.

ప్రతి వారంలో శని ఆదివారం నాగార్జున హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లతో మాట్లాడుతూ ఆ వారంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి, వారి ఆట తీరు గురించి చర్చిస్తారు.

ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్ లో భాగంగా హౌస్ సభ్యులతో మాట్లాడిన నాగార్జున వారిని అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ అడిగారు.

అదేవిధంగా శనివారం కార్యక్రమంలో భాగంగా కైగర్ కారు గురించి హౌస్ సభ్యులకు టాస్క్ ఇచ్చారు.

ఎంతో సరదాగా సాగిన ఈ టాస్క్ లో చివరికి కంటెస్టెంట్ ప్రియా విశ్వల మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే విశ్వ మాట్లాడుతూ.తనని టార్గెట్ చేస్తూ ప్రియ మాట్లాడుతుందని విశ్వ అనగా నోరు అదుపులో పెట్టుకో అని ప్రియ వార్నింగ్ ఇస్తుంది.

ఇలా ఈ టాస్క్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ సభ్యులతో ఒక చిన్న గేమ్ ఆడిస్తారు.

ఈ ఆటలో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఎవరూ రూలర్ గా ప్రవర్తిస్తారో, ఎవరు బానిసలుగా ఉంటారో చెప్పాలని చెబుతాడు.

"""/"/ ఈ క్రమంలోనే ప్రియతో ఈ ఆట మొదలు పెడతాడు బిగ్ బాస్.

ముందుగా ప్రియా శ్రీరామ్ ను రూలర్ గా తెలియజేసే అతనికి రాజు కిరీటాన్ని పెడుతుంది.

అదేవిధంగా హమీదను బానిసగా భావించి ఆమెకు చిన్న కిరీటాన్ని పెడతారు.ఇలా హౌస్ లో ఉన్నటువంటి చాలామంది కంటెస్టెంట్ లు రూలర్ గా శ్రీరామ్ ను, బానిసగా హమీదాను ఎంచుకుంటారు.

ఇక షణ్ముఖ్ ను శ్రీరామ్ రూలర్ గా భావించి, హమీదాను బానిసగా చెబుతూ అసలు బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కంటెంట్ లో కాకుండా 14 మంది ఉన్నట్టు ఉంటుంది.

అసలు హ మీద ఇంట్లో లేనట్టే ఉంటుంది ఉంటూ హమీదా పై సెటైర్లు వేస్తాడు.

దీనితో హమీద అసలు నువ్వాడుతున్నావా అంటూ షణ్ముఖ్ పై సెటైర్ వేసింది.ఇలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ కి హమీదాను బానిసగా చేశారు.

అయితే నేడు నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిలో హమీద ఎలిమినేషన్ అవుతుందని సమాచారం.

విదేశీ విద్యార్ధుల పనిగంటలపై ఆంక్షల దిశగా కెనడా..?