అందులో షణ్ముఖ్ చాలా వీక్.. అసలు చెయ్యలేడు.. శ్వేతా వర్మ కామెంట్స్ వైరల్?

బిగ్‌బాస్‌ సీజన్ 5 రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది.కాగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లను పంపించేసి ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుకుంటున్నవారిని హౌస్‌లో ఉంచుతున్నారని కొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పైగా ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్‌ అయితే అందులో ఐదుగురు ఆడవాల్లే ఎలిమినేట్ అయ్యారు.

ఇకపోతే ఆరో వారంలో బయటకు వచ్చేసిన శ్వేత వర్మ ఎలిమినేషన్‌ను ఇప్పటికీ తెలుగు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆమె హౌస్‌లోకి తిరిగి వస్తే బాగుంటుందని మరి కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

కానీ ఇప్పట్లో రీఎంట్రీ అనే ఆప్షన్‌ ఉండకపోవచ్చని సమాచారం.ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు ఎంత మంది నామినేట్ చేసినా, ఇప్పటికీ అదే ట్రెండింగ్ లోనే, అత్యధిక ఓటింగ్స్ తో ముందు ఉంటున్నాడు ప్రముఖ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్.

చాలా మంది షణ్ముఖ్ అసలు ఏమీ ఆడట్లేదు.ఎప్పుడూ కూర్చునే ఉంటాడు అని.

ఆ విషయంపై ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 నుంచి బయటకు వచ్చిన శ్వేతా వర్మ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

కరోనా టైంలో షణ్ముఖ్ డిజిటల్ గా జనాలకు చాలా దగ్గరయ్యారు అని శ్వేతా వర్మ అన్నారు.

"""/"/ కాబట్టి అతను హౌజ్ లో ఉన్నపుడు తనను సపోర్ట్ చేయడానికి అభిమానులు ఇష్టపడతారని ఆమె చెప్పుకొచ్చారు.

తనకు తెలిసినంత వరకు షణ్ముఖ్ చాలా మంచి వ్యక్తి అన్న ఆమె, కొన్ని ఫిజికల్ టాస్క్ లు వచ్చినపుడు మాత్రం తాను అంతగా పార్టిసిపేట్ చెయ్యడు అని ఆమె స్పష్టం చేశారు.

అక్కడ ఎందుకో కొంచెం షణ్ముఖ్ వీక్ అని శ్వేతా వర్మ అభిప్రాయ పడ్డారు.

కానీ ఫిజికల్ టాస్క్ లో కూడా అతను పాల్గొంటే బాగుంటుందనేది తన ఉద్దేశం అని చెప్పారు శ్వేతా వర్మ.

బిగ్ బాస్ అన్నాక ప్రతీ టాస్క్ లోనూ పార్టిసిపేట్ చేయాలి కచ్చితంగా. """/"/ అంత రీచ్ ఉంది కాబట్టి అంతే రేంజ్ లో అతను కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆమె తెలిపారు.

తాను హౌజ్ మెట్స్ కి గట్టి పోటీని ఇచ్చానన్న ఆమె, తనకు అంత రీచ్ ఉండకపోవడం కూడా తాను ఎలిమినేట్ కావడానికి ఒక కారణం అయి ఉండవచ్చని ఆమె చెప్పారు.

కొన్ని సార్లు అది రీచ్ మేటర్స్ ఆమె అన్నారు.ఎందుకంటే ఎవరు ఎవర్ని నామినేట్ చేసినా కూడా చివరికి ఉంటామా , లేదా అన్నది ఓటింగ్స్ పై ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పారు.

కాబట్టి రీచ్ అనేది చాలా ముఖ్యం అని ఆమె వెల్లడించారు.

న‌ల‌భైల్లో పిల్ల‌ల‌ను ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి!