ఫస్ట్ ఎపిసోడ్ తోనే అరుదైన రికార్డ్ సాధించిన 'బిగ్ బాస్ 5'!

బుల్లెతెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 అనుకున్నట్టుగానే నిన్న ఆదివారం రోజు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.

ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయినా బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

ఎప్పటిలాగానే ఈసారి కూడా నాగార్జున ఫుల్ జోష్ తో ఎనర్జిటిక్ గా ఎపిసోడ్ ను స్టార్ట్ చేసాడు.

ఇప్పటికే రెండు సీజన్స్ కు హోస్ట్ గా చేసిన నాగ్ ఇప్పుడు మూడవ సారి కూడా రెడీ అయిపోయాడు.

"""/"/ తన యాంకరింగ్ తో మరొకసారి మెప్పించాడు.మంచి పాటతో డాన్స్ చేసి అందరగొట్టాడు.

ఫస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని తిప్పి చూపించాడు.

గత సీజన్స్ లో వచ్చిన రూమర్స్ ను పోగొట్టుకునేందుకు ఈసారి బిగ్ బాస్ లో అందరు ఫేమస్ అయినా వాళ్లనే కంటెస్టెంట్స్ గా తీసుకు వచ్చింది.

యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఫేమస్ అయినా వారిని సెలెక్ట్ చేసుకుంది.ఇది ఇలా ఉంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ లోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.

ఈ షో గురించి మన దేశంలో ఎక్కువ మంది ట్వీట్ చేసిన ప్రోగ్రామ్స్ లో రెండవ స్థానం సంపాదించుకుంది.

దీంతో ఈసారి సీజన్ టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీగా మారిపోయింది.తెలుగు ప్రోగ్రామ్ కు ఈ రేంజ్ లో ట్వీట్స్ వచ్చి రెండవ స్థానం సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు.

ఈ అరుదైన ఘనతను బిగ్ బాస్ సీజన్ 5 సొంతం చేసుకుంది. """/"/ ఇక ఈరోజు నుండి ఈ ప్రోగ్రామ్ నాన్ స్టాప్ గా ప్రసారం కాబోతుంది.

రాత్రి 10 నుండి 11 వరకు ఈ షో టివి లో ప్రసారం కాబోతుంది శని ఆదివారాలు మాత్రం 9 నుండి 11 వరకు ప్రసారం చేయబోతున్నారు.

ఇక ఈ షో మొదలైన ఒక్కరోజులోనే విజేత ఎవరు అనేది గుసగుసలు వినిపిస్తున్నాయి.

షణ్ముఖ్ జశ్వంత్ కానీ లేదా యాంకర్ రవి కానీ ఇద్దరిలో ఒకరు అంటూ అప్పుడే ప్రచారం సాగుతుంది.

ఇక ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ విన్నర్ గా ఒక్కసారి కూడా ఫిమేల్ కంటెస్టెంట్స్ రాలేదు.

నాలుగు సీజన్స్ కూడా మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే విన్నర్స్ గా నిలిచారు.మరి ఈసారి అయినా ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.

అల్లు అర్జున్ బోయపాటి కాంబోలో సినిమా రానుందా..? ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది…