బిగ్ బాస్-4 కి ఎక్స్ ట్రా అందం రెడీ.. ఎవరంటే?

బిగ్ బాస్ షో కి ఉన్న పాపులారిటీ మనందరికీ తెలిసిందె.హిందీ, తెలుగు, తమిళం, మలయాళం అన్న తేడా లేకుండా ఏ భాషలో ఈ రియాలిటీ షో టెలికాస్ట్ అయినా కూడా దీని క్రేజ్ ఎప్పటికీ తరగదు అనే చెప్పాలి.

ఇక మరో ఐదు రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లోకి 16 మంది సభ్యులు వచ్చి సందడి చేయనున్నారు.

వీరందరికీ జడ్జిగా వ్యవహరించేందుకు ప్రేక్షకులు కూడా రెడీ అయిపోయారు.నాలుగో సీజన్ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించేందుకు నాగార్జున కూడా రెడీ అయిపోయారు.

ఎంత పవఎ ఫుల్ కంటెస్టెంట్స్ ఉన్నా కూడా షో లో అందగత్తెలు లేకపోతే అసలు మజా ఉండదు అన్నది ప్రేక్షకులు మాట.

అందుకు తగ్గట్టే ఈ సారి కూడా షో నిర్వాహకులు చాలామంది అందగలత్తెను కంటెస్టెంట్స్ గా హౌస్ లోనికి ఎంట్రీ ఇచ్చేశారు.

వారిలో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు ప్రియా వడ్లమని, అపూర్వ, దేత్తడి హారిక, యాంకర్ ప్రశాంతి, యామిని భాస్కర్, యాంకర్ అరియానా గ్లోరీ, యాంకర్ లాస్య ఉన్నారు.

అయితే వీరందరి తో పాటు ఎక్స్ట్రా అందాన్ని జత పరిచేందుకు సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ కూడా చివరి నిమిషంలో ఓకే అయినట్లు సమాచారం.

ఇక్కడ ఉన్న చాలా మంది అందగత్తెలకు జతగా ఈ ముద్దుగుమ్మ షో లో సందడి చేషేందుకు రెడీ అయిపోయిందని….

ఇప్పటికే క్వారంటైన్ ప్రక్రియను కంప్లీట్ చేసేసిందని సమాచారం.ఇక ఈ అందగత్తెలను చూడాలంటే సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఆగాల్సిందే.

గుర్తు పెట్టుకో.. వడ్డీతో సహా తిరిగొస్తుంది.. వైరల్ అవుతున్న నయన్ సంచలన పోస్ట్!