కళ్యాణ్ రామ్ బింబిసార నుంచి బిగ్ అప్డేట్?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తారక రామారావు పతాకంపై హరికృష్ణ కే నిర్మిస్తున్నటువంటి చిత్రం బింబిసార.

ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నింటికీ ఈ సినిమా ఎంతో విభిన్నమైనదని చెప్పవచ్చు.

కళ్యాణ్ రామ్ 18 వ సినిమాగా ఒక మైథలాజికల్ సినిమాలో నటిస్తున్నారు.ఈ క్రమంలోనే గతంలో ఈ సినిమా నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ క్రమంలో ఈ పోస్టర్ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు కూడా ఈ సినిమాని పూర్తిగా మరిచిపోయారు.

ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి అప్డేట్ విడుదల చేశారు. """/"/ ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రోమో ద్వారా వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో క్యాథరిన్, సంయుక్త మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్ల పాత్రలో నటించగా ఈ సినిమా ద్వారా వశిష్ట అనే డైరెక్టర్ పరిచయం కానున్నారు.

తాజాగా విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

చివరి శ్వాస వరకు బీజేపీ కోసం పనిచేస్తా..: కిషన్ రెడ్డి