వైఎస్ షర్మిలకు బిగ్‌షాక్.. వైఎస్సార్‌టీపీ పేరు మార్చాల్సిందేనా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.

తెలంగాణ కోడలని అని చెప్పుకుని ఖమ్మం జిల్లాలో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కంకణం కట్టుకుంది.

కాకపోతే ఆమెకు ఆదిలోనే ప్రజాధారణ కరువైంది.తన తండ్రి, అన్న అధికారంలోకి ఎలా వచ్చారో షర్మిల కూడా అదే బాటను ఎంచుకుంది.

రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుకుంది.ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టగా ప్రధాన మీడియా దానిని ఫోకస్ చేయలేదు.

దీంతో షర్మిల తెలంగాణలో వర్కౌట్ కావడం లేదని ఏపీకి మకాం మార్చాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆమెకు మరో కొత్త సమస్య వచ్చిపడింది.తన పార్టీ పేరు మార్చాలంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

ఆ పార్టీ పేరుపై పలు అభ్యంతరాలు వ్యక్తమైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది.వైఎస్ఆర్ అనే పేరు ఉపయోగించే విషయంలో అన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని, అందుకే పార్టీ పేరును పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయలేదని ప్రకటించింది.

అందుకోసం కొత్త పేర్లు ప్రతిపాదించాలని సూచించినట్టు ఈసీ వెల్లడించింది.గతంలో వైఎస్ఆర్‌సీపీ పేరుతో వచ్చిన జగన్ పార్టీలో వైఎస్ఆర్ పేరును తొలగించాలని ఆ పార్టీ పూర్తి పేరు యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ అనేది వాడుకోవాలని.

వైఎస్ఆర్ పేరు వాడుకోవడం వలన తన పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈసీకి ఫిర్యాదు చేశారు.

"""/" / ఇప్పుడు షర్మిల పార్టీ పేరుపైనా ఆయనే ఫిర్యాదు చేశారు.దీనిపై ఆరా తీయగా ఇంకా షర్మిల పార్టీ రిజిస్టర్ కాలేదని ఈసీ నుంచి సమాధానం వచ్చింది.

వైయస్ షర్మిల పార్టీని రిజిస్టర్ చేయలేదని, మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని షర్మిలకు లేఖ కూడా రాసినట్లు ఎన్నికల సంఘం చెప్పిందని అన్న వైఎస్ఆర్‌ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇన్ని ఇబ్బందుల నడుప షర్మిల ఏపీకి మకాం మార్చాలని చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇదే అవకాశంగా భావించి తెలంగాణ అనే పేరు తీసేసి రెండు రాష్ట్రాల్లో ఉపయోగపడేలా పార్టీ పేరును ఖరారు చేస్తారన్న చర్చ నడుస్తోంది.

Chandrababu : వైసీపీ అధికారంలో రాయలసీమ ఎడారిగా మారింది..: చంద్రబాబు