కంచుకోటలోనూ ఈ కుదుపు ఏంటి? 

ఏపీ అధికార పార్టీ వైసిపికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు( MLC Elections ) పెద్ద ఎదురుదెబ్బే తగిలేలా చేశాయి.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ను ఏర్పాటు చేస్తామని, ప్రజలంతా వైసిపి( YCP ) ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారని, సంక్షేమ పథకాలు తమను మళ్ళీ గట్టెక్కిస్తాయని జగన్ ధీమా గానే ఉంటూ వస్తున్నారు.

ఆర్థికంగా ప్రభుత్వానికి ఎన్ని రకాల ఇబ్బందులు ఏర్పడినా, సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నారు.

ఎప్పుడు, ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా, వైసిపి హవా కనపడుతూనే వచ్చింది.అయితే ఇప్పుడు జరిగిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించడం ఏపీ అధికార పార్టీ వైసిపికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

ఈ మూడు స్థానాల్లో విజయాన్ని టిడిపి( TD{ ) జనాలోకి తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అనే విషయాన్ని హైలెట్ చేస్తోంది.

"""/" / ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం చెందడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.

రాయలసీమ తూర్పు, పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు గెలుపొందడం పెద్ద ఎదురుదెబ్బ గానే వైసిపి చూస్తోంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి రాయలసీమ జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో, రాబోయే ఎన్నికల్లో వైసిపి విజయం పై ఎన్నికల ప్రభావం స్పష్టంగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో ఓటర్ల మనోగతం ఏవిధంగా ఉంది అనేది ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో అర్థమవుతుందనే ప్రచారం టిడిపి మొదలుపెట్టింది.

"""/" / అదీ కాకుండా, కంచుకోటగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎదుర్కోవడాన్ని వైసిపి చాలా సీరియస్ గానే తీసుకుంది.

అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది ? ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం పై వైసిపి పోస్ట్ మార్టం చేసుకుంటోంది.

ప్రస్తుతం జరిగిన నష్టంపై వైసీపీ ఎంతగా సమీక్షలు చేసినా, దీనికి బాధ్యులను చేసి ఎవరిపైన వేటు వేసినా, జరిగిన నష్టం మాత్రం తీవ్రంగానే ఉంది.

జగన్ ( Jagan ) సొంత జిల్లాలోనూ ఈ విధంగా జరగడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇప్పటి వరకు రాయలసీమ కంచుకోటగా భావిస్తూ వస్తున్న వైసిపికి  ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కనువిప్పు కలిగించాయి.

ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు..: కొడాలి నాని