కేవలం 3 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయిందా..? ‘ఆదిపురుష్’ మేకర్స్ కి ఊహించని షాక్!

గత ఏడాది మే నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత టాలీవుడ్ లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా విడుదల కాలేదు.

ఈ ఏడాది ప్రారంభం లో సీనియర్ హీరోలైన చిరంజీవి మరియు బాలకృష్ణ 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహా రెడ్డి' చిత్రాలతో మన ముందుకు వచ్చారు.

ఈ రెండు సినిమాలలో 'వాల్తేరు వీరయ్య' చిత్రం సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి బయ్యర్స్ కి చాలా కాలం తర్వాత భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది.

ఆ తర్వాత ఆ రేంజ్ లాభాలు తెచ్చి పెట్టిన చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' చిత్రం.

అయితే స్టార్ హీరో సినిమాలు ఈ సమ్మర్ లో ఒక్కటి కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇప్పుడు అందరి చూపు జూన్ 16 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ప్రభాస్ ( Prabhas ) 'ఆదిపురుష్'( Adipurush ) చిత్రం పైనే ఉంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఫాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ట్రేడ్ లో కూడా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది.అమెరికా , జర్మనీ వంటి ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

అమెరికా లో ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్( Advance Bookings ) ట్రెండ్ ని ఒకసారి పరిశీలిస్తే 180 షోస్ కి 40 వేల డాలర్లు వచ్చాయట.

ఇది కేవలం తెలుగు వెర్షన్ కి మాత్రమే కాదు, హిందీ వెర్షన్ కి కూడా కలిపి అట.

అయితే హిందీ వెర్షన్ కి టిక్కెట్లు ఇప్పటి వరకు కేవలం 3 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయట.

"""/" / ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ని కాస్త కలవర పెడుతుంది.ఎందుకంటే ట్రేడ్ మరియు ఫ్యాన్స్ తెలుగు వెర్షన్ కంటే కూడా హిందీ వెర్షన్ కి అత్యధిక వసూళ్లు వస్తాయని ఆశించారు.

ఎందుకంటే నార్త్ ఇండియన్స్ కి శ్రీ రాముడు అంటే ప్రాణం.ఇప్పటి వరకు విడుదలైన హిందీ వెర్షన్ పాటలు మరియు ట్రైలర్ కి కూడా ఊహించని రేంజ్ లో వ్యూస్ రావడం తో కచ్చితంగా హిందీ లో ఈ చిత్రం ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నారు.

కానీ అమెరికా లో కేవలం మూడు టిక్కెట్లు తెగడం చూసి అభిమానులు కంగారు పడుతున్నారు.

అయితే ట్రేడ్ పండితులు మాత్రం , """/" / కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఇంకా హిందీ వెర్షన్ కి సంబంధించి మెయిన్ లొకేషన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదని, ఇప్పుడు మనం చూస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇండియన్స్ తక్కువ ఉంటారని, అందుకే అంత టికెట్స్ అమ్ముడుపోయాయని చెప్తున్నారు.

ఇంకా సినిమా విడుదలకు 16 రోజుల సమయం ఉంది.కచ్చితంగా ఈ చిత్రం ప్రీమియర్స్ సమయానికి 1 మిలియన్ మార్కుని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రీమియర్ షోస్ నుండి అత్యధిక వసూళ్లను రాబట్టిన నాన్ రాజమౌళి సినిమా గా పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం నిలిచింది.

ఆదిపురుష్ చిత్రం ఆ రికార్డుని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.

దీపికా పదుకొనేకు ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్ మాత్రం కాదంటూ?