తొలి మ్యాచ్ గెలిచిన గుజరాత్ కు భారీ షాక్.. ఐపీఎల్ కు కెన్ విలియమ్సన్ దూరం..!

ఐపీఎల్ సీజన్-16( IPL Season-16 ) లో తొలి మ్యాచ్ గెలిచి పట్టలేని సంతోషంలో ఉన్న గుజరాత్ టైటాన్స్( Gujarat Titans ) కు భారీ షాక్ తగిలింది.

గుజరాత్ జట్టులో కీలక ఆటగాడైన కెన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ సీజన్ నుండి తప్పుకోవాల్సి వచింది.

చెన్నై ఇన్నింగ్స్ లో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్స్ ను ఆపడానికి ప్రయత్నించే క్రమంలో బౌండరీ వద్ద కెన్ విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయం అయింది.

గాయంతో నడవలేని పరిస్థితిలో ఉన్న విలియమన్స్ ను సిబ్బంది భుజాలపై ఎత్తుకొని తీసుకువెళ్లారు.

అతడు ఆడే పరిస్థితులలో కనిపించకపోవడంతో ఇంపాక్ట్ ప్లేయర్గా సుదర్శన్( Sudarshan ) అతని స్థానంలోకి దింపారు.

బౌండరీ వద్ద విలియమ్సన్ కింద పడ్డప్పుడే అర్థమైంది బలంగా గాయం తగిలి ఉంటుందని అనుమానం వచ్చింది.

ప్రస్తుతం ఆ అనుమానమే నిజం అయ్యింది. """/" / వైద్య పరీక్షల తర్వాత గాయం తీవ్రంగా ఉందని, మోకాలికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు.

అంతేకాకుండా ఆయనకు దాదాపు 45 నుంచి 60 రోజుల వరకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు.

ఎంతో అనుభవం ఉన్న కెన్, గాయం కారణంగా దూరమవడం చాలా బాధగా ఉందని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ కిర్ స్టన్ తెలిపాడు.

ఇక గుజరాత్- చెన్నై మధ్య మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.

రుతురాజ్ గైక్వాడ్ ( Ruthuraj Gaikwad )92 పరుగులు జోడించడంతో చెన్నై జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి ఇంకా నాలుగు బంతులు ఉండగానే 182 పరుగులు చేసి తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీ చేయగా.మిగిలిన ఆటగాళ్ల కృషితో చెన్నైని చిత్తు చేసింది గుజరాత్.

దానికి నేనేమీ బ్రాండ్ అంబాసిడర్ కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!