బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. చెన్నూరులో గెలుపు కష్టమేనా..?
TeluguStop.com
గత రెండు పర్యాయాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్( BRS ) పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది.
మూడోసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.ఈ తరుణంలోనె అన్ని రకాల పన్నాగాలు రెడీ చేసి పెట్టుకుంది బీఆర్ఎస్ సర్కార్.
అంతేకాకుండా 115 నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించింది.దీంతో మొదలైంది అసలు కథ.
గత కొంతకాలం నుంచి టికెట్ కోసం ఆశించి బంగపడ్డ నేతలు ఈసారి టికెట్ వస్తుందని ఆశపడ్డారు.
కానీ వారికి ఈసారి టికెట్ ఇవ్వక మళ్లీ సిట్టింగ్లకే ప్రకటించడంతో అసంతృప్తికి లోనయ్యారు.
దీంతో చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ( NALLALA ODELU ).
"""/" / ఈయన చెన్నూరులో( CHENNURU ) 2009 సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు, అలాగే 2010, 2014 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు.
అలా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన నల్లాల ఓదెలుకు చెన్నూరు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.
2018లో ఆయనకు సీఎం కేసీఆర్( KCR ) టికెట్ నిరాకరించడంతో బాల్క సుమన్ కి( BALKA SUMAN ) ఇచ్చారు.
దీంతో అసంతృప్తికి లోనైనా ఆయన భార్యకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అవకాశం ఇచ్చారు.
"""/" / ఇక అప్పటినుంచి అలాగే కొనసాగుతూ వస్తున్న వారు ఈసారైనా టికెట్ వస్తుందని ఆశపడ్డారు.
కానీ ఇప్పుడు కూడా మళ్లీ బాల్క సుమన్ కు( SUMAN ) టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్( CONGRESS ) పార్టీలో చేరారు.
మరి చెన్నూరులో బలమైన నేతగా ఉన్నటువంటి నల్లాల ఓదెలు, కాంగ్రెస్ లో చేరడంతో బాల్క సుమన్ కి ఈసారి ఇబ్బందులు ఎదురవుతాయని గెలుపు తీరాలకు వెళ్లడం కష్టమే అని రాజకీయ నిపుణులు అంటున్నారు.