రామగుండం కార్పొరేషన్‎లో బీఆర్ఎస్‎కు బిగ్ షాక్..!!

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‎లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.

కార్పొరేషన్‎ మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరేందుకు వీరంతా రంగం సిద్ధం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో కలిసి హైదరాబాద్ లోని గాంధీభవన్ కు వెళ్లనున్నారు.

అనంతరం రేవంత్ రెడ్డి సమక్షంలో మేయర్, కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

జాతి రత్నాలు సినిమా చేయను అని చెప్పాను : ఫరియా