పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం( Vemulawada ) 25 వార్డుకు చెందిన గూడూరి లక్ష్మి- మధు సుమారు 100 మందితో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు.
25 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.
అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
అక్రమ వలసదారుల ఏరివేత .. యాక్షన్లోకి ట్రంప్, గురుద్వారాలలో యూఎస్ ఏజెంట్ల తనిఖీలు