స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
TeluguStop.com
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది.
చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ పై ఉన్న షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయని తెలిపింది.
చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందజేయాలన్నారు.ఈ నెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని సూచించింది.
ఈనెల 29 తరువాత ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని వెల్లడించింది.