కన్నడ పాలిటిక్స్‌లో భారీ కుదుపు.. సాధారణ బస్ కండక్టర్ ఇంట్లో రూ.750 కోట్లు

కర్ణాటకలో ఇటీవల వెలుగుచూసిన ఓ ఘటన అక్కడి రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది.ఓ సాధారణ బస్ కండక్టర్ ఇంట్లో రూ.

750 కోట్ల నగదు పట్టుబడటమే అందుకు కారణం.ఇంత భారీ మొత్తంలో డబ్బు ఐటీ అధికారులకు దొరకడంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ విషయంపై ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేసి ఓ ఆటాడుకుంటున్నాయి.ఎందుకో తెలుసా.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) లో పనిచేసే ఓ సాధారణ బస్ కండెక్టర్ ఇంట్లో ఐటీ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు.

అతని ఇంట్లో ఏకంగా రూ.750 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు కథనాలు వెలువడ్డాయి.

ఏకకాలంలో 47 చోట్ల తనిఖీలు జరిపినట్టు తెలిసింది.కండక్టర్ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందనేది ఇప్పుడు అర్థంకాని ప్రశ్న.

అయితే, ఆ ఉద్యోగి డిప్యూటేషన్ మీద కొన్నేళ్లు సీఎం కార్యాలయంలో పని చేయడంతో అది కాస్త అధికార పార్టీ మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఎంఆర్ ఉమేష్ అనే బీఎంటీసీ ఉద్యోగిని గతంలో సీఎం ఆఫీసులో పనినిమిత్తం డిప్యూటేషన్‌పై తీసుకున్నారు.

"""/"/ ఎందుకు తీసుకున్నారనేది తెలియలేదు.కానీ, అతనింట్లో బయటపడిన రూ.

750 కోట్ల అక్రమాస్తులు ఎవరివి అనేదే ఇప్పుడు మేజర్ ప్రశ్న.ఉమేష్‌పై ఇంటిపై ఐటీ రైడ్స్ జరగడంతో మాజీ సీఎంలు యడియూరప్ప, సిద్ధరామయ్యలు చేతులు కలిపే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికే వీరిద్దరూ ఒకసారి సమావేశం అయ్యారంటూ H3 Class=subheader-styleమాజీ సీఎం కుమారస్వామి/h3p ఆరోపించారు.

"""/"/ యడియూరప్ప సీఎంగా ఉన్న టైంలో ఉమేష్ పలు స్కామ్స్‌లో నిందితుడుగా తేలింది.

సీఎం యడ్డి కొడుకు విజయేంద్రతో ఉమేష్‌కు సంబంధాలున్నాయని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి.విజయేంద్ర, ఉమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఒక స్కామ్‌కు మాజీ సీఎం తనవంతు సహకారం అందించారనే ఆరోపణలు వచ్చాయి.

కర్ణాటకకు కొత్త సీఎంగా బొమ్మై బాధ్యతలు స్వీకరించాక కూడా ఉమేష్ సీఎం ఆఫీసులోనే పనిచేస్తూ వచ్చాడని తెలిసింది.

ఐటీ దాడుల తర్వాత ఉమేష్‌ను బీఎంటీసీ వెనక్కు పిలిపించింది.అయితే, ఈ అక్రమాస్తుల కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని మాజీ సీఎంలు ఆందోళన చెందుతున్నారట.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ