బిగ్ బ్రేకింగ్: యధాతధంగా ఏలూరులో ఎన్నికలు..!!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయడం అందరికీ తెలిసిందే.

ఇలాంటి తరుణంలో నిన్న ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా హైకోర్టు కొట్టివేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు యధాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది.

హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.ఏలూరు చుట్టుపక్కల 7 గ్రామాల విలీనం ఎప్పుడు జరిగింది.

అయితే గ్రామాల పరిధిలో చాలా మంది ఓటర్లను .ఏలూరు వోటర్ లిస్టు లో కలపలేదు అంటూ ఆయా గ్రామాలకు చెందిన 33 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఏలూరు ఎన్నికలను నిలిపివేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది.ఏలూరులో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సమయంలో ఎన్నికలు ఆపితే .

సాంకేతిక ఇబ్బందులు వస్తాయి అంటూ వాదనలు వినిపించింది.దీంతో వాదనలు విన్న హైకోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కాకపోతే కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

అలసత్వం వహించిన అధికారులపై చర్యలు..: మంత్రి తుమ్మల