మెగాస్టార్ కి తల్లి గా బిగ్ బాస్ కంటెస్టెంట్...
TeluguStop.com
సెలబ్రిటీ హోదా కి అలాగే స్టార్ డమ్ కి వయసుతో సంబంధం లేదని ఇప్పటికే చాలా మంది నటీనటులు నిరూపించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఒక మారుమూల పల్లెలో పుట్టి పెరిగి 50 ఏళ్ళ వయసులో యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరించడమేకాకుండా ఏకంగా ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయినటువంటి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని ఎంతగానో ఆకట్టుకున్న "గంగవ్వ" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అనంతరం గంగవ్వ కి సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి.
కాగా ఇటీవలే గంగవ్వ తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన "లవ్ స్టోరీ" చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.
అయితే ఇటీవలే శేఖర్ కమ్ముల, నాగచైతన్య, ఈశ్వరీరావు గంగవ్వ తదితరులు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఇందులో భాగంగా దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి స్పందిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల "లవ్ స్టోరీ" చిత్రంలో తనకి సంబందించిన కొన్ని సన్నివేశాలను డిలీట్ చేసినప్పటికీ తన తదుపరి చిత్రంలో అవకాశం ఇవ్వాలని కోరింది.
అంతేకాకుండా శేఖర్ కమ్ముల ఓపిక చాలా ఎక్కువ తనకు నచ్చినట్లు సన్నివేశం వచ్చేంతవరకు ఎన్నిసార్లయినా ఏమాత్రం విసుక్కోకుండా శ్రమిస్తాడని చెప్పుకొచ్చింది.
దీంతో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా మున్ముందు రాబోయే చిత్రాలలో గంగవ్వ కి అవకాశాలు ఇస్తాడునని తెలిపాడు.
ఇంటర్వ్యూ లో భాగంగా గంగవ్వ తాను ప్రస్తుతం తెలుగులో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాధర్" చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది.
అయితే ఈ చిత్రంలో తాను మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా నటిస్తున్నట్లు కూడా తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది.
అలాగే ఇటీవల ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ నిమిత్తమై "ఊటీ" కి వెళ్లి వచ్చినట్లు కూడా తెలిపింది.
దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ మనలో "టాలెంట్" ఉంటే సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా ఎప్పటికైనా గుర్తింపు దొరుకుతుందని అందుకు ఉదాహరణగా గంగవ్వ గురించి చెప్పవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"""/"/
అయితే ఈ విషయం ఇలా ఉండగానే గాడ్ ఫాధర్ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
స్టార్ యాంకర్ ఝాన్సీ కూతురిని చూశారా.. ఈమె కచ్చితంగా హీరోయిన్ అవుతుందంటూ?