పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బిగ్ బాస్ విన్నర్ కౌశల్
TeluguStop.com
బిగ్ బాస్' సీజన్ 2 రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరో రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకున్న అన్తుడు కౌశల్.
బిగ్ బాస్ షోలో తన వ్యక్తిత్వంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కౌశల్ ఈ షో ద్వారా మంచి మైలేజ్ సొంతం చేసుకొని కౌశల్ కి మంచి గుర్తింపు వచ్చింది.
ఆ పాపులారిటీతో తెలుగులో బిజీ స్టార్ గా మారిపోతాడని, హీరోగా అవకాశాలు వస్తాయని చాలా మంది భావించారు.
అయితే కౌశల్ కి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఏవో కారణాల వలన ఆగిపోయాయి.
కౌశల్ కారణంగానే ఆ సినిమాలు ఆగిపోయాయని టాక్ వినిపించింది.కథలు వేలుపెట్టి ఇష్టానుసారంగా మార్చమని చెప్పడంతో వచ్చిన అవకాశాలు కూడా దూరం అయ్యాయని చర్చ నడిచింది.
తాజాగా కౌశల్ కి ఒక అవకాశం లభించినట్టు తెలుస్తోంది.ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనుంది.
లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం కౌశల్ ను తీసుకున్నారని సమాచారం.
ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందనీ, తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని కౌశల్ భావిస్తున్నాడు.
పొలోమని సినిమాలు చేసుకుంటూ వెళ్తారు కానీ ఒక్క హిట్టూ కొట్టలేరు.. ఎవరంటే..?