బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మనందరికీ తెలుసు.అయితే బిగ్ బ్యాంగ్ వల్లే యూనివర్స్ పుట్టిందని చాలా మంది సైంటిస్ట్ లు చెప్పారు.
కానీ బిగ్ బ్యాంగ్ వల్ల యూనివర్స్ పుట్టలేదని, దానికంటే ముందు వేరే యూనివర్స్ ఉండేదని, బిగ్ బ్యాంగ్ అనేది ఆ యూనివర్స్ కు ముగింపు అని నోబెల్ ప్రైజ్ విజేత రోజర్ పెన్రోస్ తెలిపారు.
రోజర్ పెన్రోస్ ప్రస్తుతం ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ తో కలిసి పనిచేస్తున్నాడు.బ్లాక్ హోల్స్ పై అతను చేసిన రీసెర్చ్ కు మంగళవారం నోబెల్ ప్రైజ్ ను పొందాడు.
నోబెల్ ప్రైజ్ గెలిచిన తరువాత ప్రెస్ తో మాట్లాడుతూ బిగ్ బ్యాంగ్ అనేది యూనివర్స్ కు మొదలు కాదని, దీనికంటే ముందు ఏదో ఉందని, అదే మనకు మళ్లీ భవిష్యత్తులో వస్తుందని ఆయన అన్నారు.
బిగ్ బ్యాంగ్ అనేది పూర్తిగా తెలుసుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు.
ఇన్ని రోజులు బిగ్ బ్యాంగ్ మన యూనివర్స్ మొదలుకు కారణం అని నమ్మిన వాళ్లంతా ఇపుడు అసలు అది ఎలా మొదలయ్యిందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ధనుష్ డైరెక్షన్ లో రజనీకాంత్ సినిమా చేస్తున్నారా..?