ఒక్కటైన డెమొక్రాట్లు, రిపబ్లికన్లు.. చేతులెత్తేసిన జో బైడెన్, నీరా టాండన్ ఆశలు ఆవిరి..!!

అంతా ఊహించినదే జరిగింది.చివరికి డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అనుకున్నది సాధించారు.

కీలకమైన బడ్జెడ్ చీఫ్‌గా భారత సంతతికి చెందిన నీరా టాండన్‌ నియామకాన్ని అడ్డుకున్నారు.

ఆమె నియామకంపై సెనెట్‌తో పాటు డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత రావడంతో అధ్యక్షుడు జో బైడెన్ వెనక్కి తగ్గక తప్పలేదు.

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే బైడెన్‌‌కు ఆయన కేబినెట్‌కు ఎదురైన తొలి ఓటమిగా విశ్లేషకులు దీనిని అభివర్ణిస్తున్నారు.

భారత మూలాలున్న నీరా టాండన్‌ను వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా బైడెన్‌ నామినేట్ చేశారు.

అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్‌, రిపబ్లిక్ నేతలను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.ఇవే ఆమె కొంప ముంచాయి.

దీంతో నీరా నియామకాన్ని కేబినెట్‌ మంత్రులు, డెమొక్రాటిక్‌, రిపబ్లికన్ చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు.

గతంలో ఆమె చేసిన ‘పక్షపాత’ వ్యాఖ్యల విషయమై డెమొక్రాట్ సెనేటర్ జో మాంచిన్ .

తాను నీరాకు మద్దతుగా ఓటు వేయబోనని తేల్చి చెప్పారు.మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నీరా టాండన్ నామినేషన్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాంచిన్ స్పష్టం చేశారు.

డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల నాయకులపై ఆమె గతంలో చేసిన దురుసు వ్యాఖ్యల చరిత్రను ఈ సందర్భంగా మాంచిన్ గుర్తు చేశారు.

ఈ ధోరణి ఎంతో ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.నీరా టాండన్ పక్షపాత ప్రకటనలు కాంగ్రెస్ సభ్యులకు, బడ్జెట్ కార్యాలయం , డైరెక్టర్ పని సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు.

సామాజిక మాధ్యమాల్లో నీరా వ్యవహార శైలి సరిగా లేదని ముగ్గురు రిపబ్లికన్లు, ఓ డెమొక్రాట్ బహిరంగంగానే విమర్శించారు.

ఆమె నియామకం ప్రక్రియ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ట్వీట్లను తన ఖాతా నుంచి డిలీట్ చేశారని వారు ఆరోపించారు.

దీనిపై ఇదివరకే నీరా సెనేటర్లను క్షమాపణ కూడా కోరారు.అయితే వైట్‌హౌస్, భారతీయ అమెరికన్ సమాజం మాత్రం ఆమెకు గట్టి మద్ధతునిచ్చారు.

ఈ పదవిని నిర్వహించేందుకు అన్ని అర్హతలు నీరాలో వున్నాయని వారు చెబుతున్నారు. """/"/ టాండ‌న్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) సెనేటర్లకు లేఖ రాసింది.

ఆర్థిక, విదేశీ వ్యవహారాల్లో అపార అనుభవమున్న నీరాను ఆ పదవిలో నియమిస్తే.అమెరికా అభివృద్ధి, సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తారని కాకస్ ఆ లేఖలో పేర్కొంది.

అలాగే "YesNeera" పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ సైతం మొదలుపెట్టారు.కానీ ఇవేవీ ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో నీరా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు.తన నియామకాన్ని ధ్రువీకరించేందుకు అధ్యక్ష కార్యాలయం, భారతీయ సమాజం ఎంతో కష్టపడ్డారని.

కానీ పరిస్ధితులు మాత్రం తనకు అనుకూలంగా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన నామినేషన్ ను విత్ డ్రా చేయాలని నీరా కోరడంతో తాను అంగీకరించానని బైడెన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఆమె అనుభవం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యంపై తనకెంతో గౌరవం ఉందని, త్వరలోనే టాండన్ మరో కీలకమైన పదవిలోకి వస్తారని ఆయన ఆకాంక్షించారు.

అయితే, ఇతర నియామకాల్లో మాత్రం బైడెన్ నిర్ణయాలకు సెనెట్ మద్దతు లభించింది.విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్, ట్రెజరీ విభాగానికి జేన్ యెల్లెన్, పెంటగాన్ చీఫ్ గా లాయిడ్ ఆస్టిన్ లు తమ బాధ్యతలను స్వీకరించారు.

పర్ఫెక్ట్ ఫిమేల్ బాడీ ఉన్న యువతి ఈమెనట.. ఏఐ ఇంకేం చెప్పిందంటే..?