బైడెన్ వ్యూహాత్మకం.. లాస్ ఏంజిల్స్‌లో ‘‘సమ్మిట్ ఆఫ్ అమెరికాస్’’ శిఖరాగ్ర సమావేశం

లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన నేతల శిఖరాగ్ర సమావేశాలకు త్వరలో అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది.

అమెరికాలోని రెండవ అతిపెద్ద నగరం లాస్ ఏంజిల్స్ ఇందుకు వేదిక కానుంది.జూన్ 6న జరగనున్న అమెరికా శిఖరాగ్ర సదస్సు.

పశ్చిమార్ధ గోళంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణపై దృష్టి సారించనుంది.అలాగే క్రమరహిత వలసలు, వాతావరణ మార్పులు, కోవిడ్‌పై పోరు వంటి అంశాలపై చర్చించనుంది.

అమెరికా అధ్యక్షుడిగా వున్న బిల్‌క్లింటన్.నాడు మయామిలో ప్రాంతీయ నేతలను అలస్కా నుంచి టియెర్రా డెల్ ఫ్యూగో వరకు విస్తరించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వైపు పురిగొల్పారు.

ఈ నేపథ్యంలో 1994 తర్వాత అమెరికా కీలకమైన రీజనల్ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి.

ఈ ప్రాంతాలలో వామపక్ష, అమెరికన్ వ్యతిరేక రాజకీయాల మధ్య అసలు లక్ష్యాన్ని వదిలివేశారు.

దీంతో వాషింగ్టన్‌తో తమ స్వంత ద్వైపాక్షిక ఎజెండాను ముందుకు తీసుకురావడానికి సమావేశం అవసరమని 30కి పైగా దేశాధినేతలు భావించారు.

రష్యా, చైనా, ఇరాన్ సహా అమెరికాతో బద్ధ విరోధం వున్న విదేశీ శక్తులు దశాబ్ధాలుగా వాషింగ్టన్ పెరడుగా అభివర్ణించే ఈ ప్రాంతంపై ప్రభావం చూపుతుండటంతో అమెరికా చాలా వరకు అండగా నిలిచింది.

2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెరూలో జరిగిన చివరి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడానికి ఇష్టపలేదు.

అయితే పశ్చిమార్ధ గోళంలో వున్న మొత్తం 35 దేశాల నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తారా లేదా అనేది తెలియరాలేదు.

గతంలో ఈ సమ్మిట్‌కు క్యూబాను ఆహ్వానించలేదు.అయితే బరాక్ ఒబామా అధ్యక్షుడిగా వున్న కాలంలో 2015లో పనామాలో జరిగిన సమావేశంలో క్యూబాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో చేయి కలిపారు.

మరోదేశం వెనిజులా.జువాన్ గైడోను దేశ చట్టబద్ధ నేతగా గుర్తించిన ట్రంప్ విధానాన్నే ప్రస్తుత బైడెన్ యంత్రాంగం ఫాలో అవుతోంది.

దీనిని బట్టి వెనిజులా సైన్యం మద్ధతుతో పాలనను కొనసాగిస్తున్న నికోలస్ మదురోను ఆ సదస్సుకు ఆహ్వానించడం అసంభవం.

టాలీవుడ్ హీరోల్లో బన్నీని పెళ్లి చేసుకోవాలని ఉంది.. కోవై సరళ కామెంట్స్ వైరల్!