అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ ట్రంప్ కష్టమే అంటున్న సర్వేలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి అంటే ప్రపంచం అంతా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.

ఎన్నికలు ముందు నుంచి జరిగే హడావిడి మొత్తం సంచలనంగా మారుతుంది.అలాగే ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ప్రపంచ మార్కెట్ లో పెంచు సంచలనాలకి కారణం అవుతాయి.

ఈ సారి కూడా అమెరికా అధ్యక్షా ఎన్నికలు మరోసారి సంచలనంగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని పట్టుదలగా ఉన్నాడు.

అయితే ఏ అధ్యక్షుడుకి లేని స్థాయిలో అమెరికాలో ప్రస్తుతం ట్రంప్ పై వ్యతిరేకత ఉంది.

దీంతో అతనికి ప్రత్యర్థిగా ఉన్న జో బిడెన్ ఈ సారి రేసులో ముందంజలోకి వచ్చేశారు.

తాజాగా వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ నిర్వహించిన సర్వేలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజల నాడి ఏంటి అనే విషయాన్ని చెప్పాయి.

ఈ సారి ఎన్నికలలో ట్రంప్‌తో పోలిస్తే బిడెన్‌కే ఎక్కువమంది అమెరికన్లు మద్దతు ఇస్తున్నట్టు సర్వేలో తేలింది.

కరోనా కట్టడిలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని, బిడెన్ అధ్యక్షుడై ఉంటే కరోనా విషయంలో పరిస్థితి మరోలా ఉండేదని మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు.

ఈ నెల 12 నుంచి 15 వరకు వివిధ అంశాల వారీగా ఈ సర్వే నిర్వహించారు.

ట్రంప్ పనితీరు బాగుందని 34 శాతం మంది మాత్రమే ఓటేశారు.అయితే, కీలకమైన భద్రత, జాతి వివక్ష, దేశాన్ని ఏకం చేయడం, ప్రజల సమస్యలను అర్ధం చేసుకోవడం, నిజాయతీ, నమ్మకం, వ్యక్తిగత విలువల్లో మాత్రం బిడెన్ కంటే ట్రంప్ బెటరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మొత్తంగా ట్రంప్‌కు 40 శాతం, బిడెన్‌కు 55 శాతం మంది అమెరికన్ల మద్దతు లభించింది.

ఫలితంగా ట్రంప్ ఎన్నిక అసాధ్యంగానే కనిపిస్తున్నాయి.కాని ఎన్నికల నాటికి దేశంలో ఉండే పరిస్థితులు ఎలా మారుతాయి అనేదానిపై ట్రంప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు..!!