నవ్వుల పాలయిన బిడెన్...వైరల్ అవుతున్న ఫోటో..!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ అధికారం చేపట్టిన తరువాత పరిపాలనను ఉరుకులు పరుగులు పెట్టిస్తు, కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో బిగ్ సక్సెస్ అయ్యాడని చెప్పడంలో సందేహం లేదు.

ఆర్ధిక భారంతో ఉన్న అమెరికాను తన నిపుణులైన టీమ్ తో మళ్ళీ గాడిలో పెట్టె పనిలో ఉన్న బిడెన్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన తరువాత ఏర్పాటు చేసిన మొదటి మీడియా సమావేశం ఎంతో ఆశక్తిగా జరిగింది.

బిడెన్ ఏం మాట్లాడుతారోనని ఎదురు చూసిన వారికి బిడెన్ వ్యవహరించిన తీరు నిరాశను మిగిల్చింది అంతేకాదు.

మీడియా సమావేశం తరువాత బిడెన్ వ్యతిరేకులు నుంచీ విమర్శలు మొదలయ్యాయి.వైట్ హౌస్ లో మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిడెన్ విలేఖరులు అడిగిన ప్రశ్నలు అన్నిటికి తన ముందు ఉన్న నోట్ బుక్ చూస్తూ సమాధానాలు చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.

రాసుకుని వచ్చిన సమాధానాలు చూసి చదవడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు బిడెన్ మీడియా సమావేశానికి సంభందిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో బిడెన్ చేతిలో విలేఖరులతో కూడిన ఓ పుస్తకం ఉంది.ఈ పుస్తకంలో విలేఖరుల ఫోటోలు అందులో రౌండప్ చేసిన విలేఖరులు ఉన్నారు.

రౌండప్ చేసిన వ్యక్తులే బిడెన్ ను ప్రశ్నలు అడిగారని, వారు అడిగిన ప్రశ్నల సమాధానాలే నోట్ బుక్ లో ఉన్నాయని వాటినే బిడెన్ చదివారని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు కామెంట్స్ తో హోరెత్తించారు.

పక్కా ప్లాన్ ప్రకారం మీడియా సమావేశం జరిగిందని, దీనిని మీడియా సమావేశం అనరని ఇదో నాటకం అంటూ మరికొందరు విమర్శలు గుప్పించారు.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం బిడెన్ పరిపాలన ఎలా చేస్తున్నాడో చూస్తేనే మంచిదని, కోడి గుడ్డుకు ఈకలు పీకద్దంటూ ప్రతి విమర్శలు చేస్తున్నారు.

నవీన్ పోలిశెట్టి ఎందుకు సినిమాలను లేట్ చేస్తున్నాడు…