ఓటిటీలో ‘బిచ్చగాడు 2’ రాక అప్పుడేనట.. డేట్ కూడా ఫిక్స్!

విజయ్ ఆంటోనీ( Vijay Antony ) పేరు చెబితే చాలు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బిచ్చగాడు.

ఈ సినిమా తోనే ఈయన తెలుగులో ఫేమస్ అయ్యాడు.అంతకు ముందు వరకు ఎవరో తెలియక పోయిన బిచ్చగాడు కాన్సెప్ట్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈ రేంజ్ లో హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది.

ఇటీవలే బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా.

అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా వసూళ్లను కూడా బాగానే రాబడుతుంది.

తెలుగులో కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమాకు పోటీగా మరో గట్టి సినిమా లేకపోవడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి వసూళ్లు తెచ్చాయి.

"""/" / చెప్పాలంటే ఈ సినిమాకు తమిళ్ లో కంటే తెలుగులో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

ఇక ఇప్పుడు రెండవ వారం కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.ఈ వారం కూడా పెద్దగా సినిమాలు లేకపోవడంతో అలరించే అవకాశం కనిపిస్తుంది.

ఇక ఇప్పుడు బిచ్చగాడు 2( Bichagadu 2 ) సినిమా ఓటిటీ ఎంట్రీ కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

"""/" / తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా జూన్ మూడవ వారంలో ఓటిటీ లోకి రాబోతుందట.

ఓటిటీ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా జూన్ మూడవ వారం నుండి తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ విషయంలో అధికారిక డేట్ కూడా త్వరలోనే రానుంది అని టాక్.ఇక విజయ్ నే డైరెక్ట్ చేయగా.

సంగీతం కూడా విజయ్ ఆంటోనీ నే అందించారు.ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ నిర్మాతగా వ్యవహరించగా కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా విజయంతో బిచ్చగాడు 3 కి కూడా విజయ్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.