రూ.313 కోట్లకు అమ్ముడుపోయిన బైబిల్.. విషయం ఇదే!

వినడానికి ఆశ్చర్యకరంగా వున్నా మీరు విన్నది అక్షరాలా నిజం.క్రైస్తవ మత గ్రంధం అయినటువంటి ఓ బైబిల్( Bible ).

వేలం పాటలో భారీ ధరకు అమ్ముడు పోవడంతో హాట్ టాపిక్ అయింది.ఆ బైబిల్ అక్షరాలా రూ.

313 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం.ఆ బైబిల్ అంత స్పెషల్ ఏమిటంటే అది అత్యంత పురాతమైనది కావడం గమనార్హం.

దాదాపు 1100 ఏళ్ల క్రితం నాటిది అది.ఈ హీబ్రూ బైబిల్ 9వ శతాబ్దపు చివరి నుండి 10వ శతాబ్దం ప్రారంభంలో రాయబడిందని చెబుతున్నారు.

"""/" / దాంతో ఇది ప్రపంచంలోనే అతి పురాతన బైబిల్ మాన్యుస్క్రిప్ట్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

ఇక దీనిని ఎవరు కొన్నారు అనే విషయానికొస్తే, రొమేనియాలో అమెరికా మాజీ రాయబారి అయినటువంటి ఆల్‌ఫ్రెడ్ మోసెస్ ఈ బైబిల్‌ను కొనుగోలు చేసి రికార్డుల్లోకి ఎక్కారు.

ఈ హీబ్రూ బైబిల్ ను అమెరికా న్యూయార్క్‌లోని( New York ) ఆక్షన్ హౌస్‌లో వేలం వేయడం జరిగింది.

ఈ బైబిల్ ను సొంతం చేసుకునేందుకు రెండు కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

చివరికి ఈ హీబ్రూ బైబిల్‌ను సోత్ బే దానిని దక్కించుకోవడం విశేషం. """/" / అమెరికన్ కరెన్సీ 38.

1 మిలియన్లకు అంటే మన భారత కరెన్సీలో రూ.313 కోట్లుకి ఆ బైబిల్ అమ్ముడు పోయింది.

వేలంలో సొంతం చేసుకున్న ఈ బైబిల్ ను.ఇజ్రాయెల్‌ టెల్ అవీవ్‌లోని యూదు మ్యూజియమ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు సోత్ బే వెల్లడించడం కొసమెరుపు.

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ రాయబారి మోసెస్ మాట్లాడుతూ.'హిబ్రూ బైబిల్( Hebrew Bible ) చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనది.

ఇది పాశ్చాత్య నాగరికతకు పునాది.అది యూదులకు చెందినదని తెలిసి సంతోషించాను' అని పేర్కొన్నారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!