అభిమాని చేతిలో దారుణ హత్యకి గురైన సెలబ్రిటీ

సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి ఒక్కరు టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా యాప్స్ తో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ తక్కువ టైంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని ఫేమస్ అయిపోతున్నారు.

అయితే ఫాన్స్ పెరుగుతున్న కొద్ది వారికి ప్రమాదం కూడా వెంట వస్తుంది.కొందరు ఫాన్స్ ముసుగులో వారితో అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరింపులకి పాల్పడటం జరుగుతూనే ఉంది.

అయితే ఓ అభిమాని ఎన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన ఓ యువతి ఇంటికి వెళ్లి దాడి చేసి అతి కిరాతకంగా హత్యా చేసాడు.

అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోరం జరిగింది.ఇన్‌స్టాగ్రామ్‌‌లో 35 వేల మంది ఫలోవర్స్ ఉన్న బియాంకా డేవిన్స్ అనే ఓ సుందరి ఇన్‌స్టాగ్రామ్‌లో డిఫరెంట్ ఫొటోలు పోస్ట్ ఫాలోయింగ్ పెంచుకుంది.

ఆమె అందానికి ఫిదా అయిన కొన్ని వేల మంది ఆమె ఫాలోవర్లుగా మారారు.

వారిలో బ్రాండన్ క్లార్క్ అనే యువకుడు కూడా ఉన్నాడు.అతను ఊహించని విధంగా బియాంకా ఇంటికెళ్లిన రహస్యంగా ఆమెని కలిసే ప్రయత్నం చేసాడు.

అతన్ని చూసి పెద్దగా అరవబోయిన ఆమెపై దాడి చేసి కత్తితో ఆమెను దారుణంగా చంపేసి తరువాత ఆమె తల కూడా నరికేసాడు.

ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందాడు.ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యి చంపిన వాడిని అదుపులోకి తీసుకున్నారు.

తాను ఆమె ఫాన్ అని, ఆమె అందానికి ఫిదా అయిపోయి సోషల్ మీడియాలోనే ప్రేమిస్తున్నా అని, అయితే ఆమె తన ప్రేమ నిరాకరించడంతో హత్య చేసానని సదరు హంతకుడు చెప్పుకురావడం విశేషం.

విద్యార్ధి వీసాలకే మా తొలి ప్రాధాన్యత : భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి