గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
TeluguStop.com
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు.గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయన చేత ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
రాజధానిలో నూతన సచివాలయం సముదాయంలో ఉన్న హెలిప్యాడ్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీఎంతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.మంత్రులలో కాను దేశాయ్, హృషీకేశ్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్ సింహ్ రాజ్‌పుట్, కున్వర్జీభాయ్ మోహన్‌భాయ్ బవలియా, ములు అయర్ బేరా, కుబేర్ డిండోర్, భాను బబారియా, హర్ష సంఘవి తదితరులు ఉన్నారు.
కన్నడంలో ప్రసంగం .. కెనడా ప్రధాని రేసులో దూకిన భారత సంతతి ఎంపీ