గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్..!

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికైయ్యారు.కాగా భూపేంద్ర పటేల్ గుజరాత్ పీఠాన్ని అధిరోహించడం రెండో సారి కావడం విశేషం.

ఈ మేరకు ఆయన ఈనెల 10న లేదా 11వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు హాజరుకానున్నారని సమాచారం.

కాగా గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయంతో బీజేపీ చరిత్ర లిఖిస్తుంది.ఎవరూ ఊహించని రీతిలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ భారీ ఆధిక్యాన్ని కనబరిచింది.

ఏకంగా 158 స్థానాల్లో కమలం విరబూసింది.మ్యాజిక్ ఫిగర్ 92 సీట్లను దాటి అధికార పీఠంపై మరోసారి కాషాయ జెండాను ఎగురవేయనుంది బీజేపీ.

బీజేపీ భారీ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి.

సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో మూవీ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?