భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
TeluguStop.com
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది.
ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించారు.సందర్శన అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనం కానున్నారు రాహుల్ గాంధీ.
ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అయితే బారికేడ్లను తోసేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బ్యారేజ్ వైపు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో బ్యారేజ్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.తరువాత అంబటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తో విష్ణు కొత్త సినిమా.. ఆ ప్రాజెక్ట్ వివరాలు ఇవే!