ఖుషి సినిమాలో తన నటనపై భూమిక చేసిన కామెంట్ ఏంటో తెలుసా?

ఖుషి.తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ మూవీ.

2001లో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించిన ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా కనిపించింది.

మామూలు పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ గా మార్చింది ఈ సినిమా.

ఈ సినిమాతో భూమిక తెలుగు ప్రజల కలల రాణిగా మారిపోయింది.మణిశర్మ సంగీతం ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ గా మారింది.

ఈ సినిమా పాటలు సంగీత ప్రియులను మైమరిపించాయి.ఈ చిత్రం జనాలకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది.

ఇగో ఇద్దరు ప్రేమికుల మధ్య ఎలాంటి ఎడబాటును కలిగించింది అనేది ఈ సినిమాలో తెలుస్తుంది.

చివరకు వీరిద్దరు కలవడంతో సినిమాకు శుభంకార్డు పడుతుంది.ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

"""/"/ నిజానికి ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది.తొలుత ఈ సినిమాను తమిళంలో విజయ్, జ్యోతిక నటించారు.

అక్కడ సూపర్ హిట్ అయ్యాక.ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించాడు ఎస్ జే సూర్య.

ఎంఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాడు.ఈ సినిమాకు హీరోయిన్ గా భూమికను సెలెక్ట్ చేసినప్పుడు ఆమె తమిళంలో వచ్చిన ఈ సినిమాను చూసింది.

అందులో జ్యోతిక క్యారెక్టర్ తో పాటు యాక్టింగ్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి.తెలుగులో ఆమె క్యారెక్టర్ పేరు మధు అని పెట్టారు.

ఆ పాత్రను చాలా ఇష్టపడింది భూమిక. """/"/ తెలుగు ఖుషి సినిమా రిలీజ్ అయ్యాక.

భూమిక మరోసారి చూసింది.ఒరిజినల్ సినిమాతో పాటు రీమేక్ సినిమాలో ఏ హీరోయిన్ బాగా నటించింది? అనే ప్రశ్న సాధారణ జనాలతో పాటు తనకు కూడా వచ్చిందని చెప్పింది భూమిక.

అయితే భూమిక జ్యోతికతో పోటీ పడి నటించిందని జనాలు అభిప్రాయపడ్డారు.కానీ భూమికకు మాత్రం తన కంటే జ్యోతికనే అద్భుతంగా చేసిందని చెప్పింది.

అటు ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సైతం చాలా అద్భుతంగా నటించాడని చెప్పింది భూమిక.

స్కిల్ సెన్సెస్ :  సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత