అలాంటి పాత్రల కోసం చాలాసార్లు ప్రయత్నించాను.. భూమిక షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
భూమికా చావ్లా( Bhumika Chawla ) తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.
ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఈ బ్యూటీ ఖాతాలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.
ఈ హీరోయిన్ తర్వాత కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకునే విషయంలో తడబడటం ఈ హీరోయిన్ కెరీర్ కు మైనస్ అయిందనే సంగతి తెలిసిందే.
అయితే ఈ హీరోయిన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగ తెగ వైరల్ అవుతున్నాయి.
"""/" /
ప్రస్తుతం ఈ బ్యూటీ అడపాదడపా పాత్రల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా వీరమ్ రీమేక్ గా తెరకెక్కి విడుదలైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ) సినిమాలో భూమిక కీలక పాత్ర పోషించడం గమనార్హం.
ఇరవై సంవత్సరాల క్రితం తేరే నామ్ అనే మూవీ సల్మాన్ ఖాన్( Salman Khan ) తో కలిసి నటించిన భూమిక తేరే నామ్ మూవీ షూటింగ్ సమయంలో నేను రిజర్వ్డ్ గా ఉండేదానినని చెప్పుకొచ్చారు.
షాట్ గ్యాప్ లో తాను పుస్తకాలు చదివేదానినని ఆమె కామెంట్లు చేశారు.ఇప్పటికీ తాను అదే విధంగా చేస్తానని భూమిక వెల్లడించారు.
తాను ప్రైవసీని( Privacy ) ఎక్కువగా కోరుకుంటానని పుస్తకాలు ఎక్కువగా చదవకపోయినా సెట్ లో అందరితో నేను కలివిడిగా ఉండటం మాత్రం తక్కువేనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో నటించాలని నాకు కోరిక అని భూమిక చెప్పుకొచ్చారు.
"""/" /
అలాంటి పాత్రల కొరకు తాను చాలా ప్రయత్నాలు చేయడం జరిగిందని అయితే తనకు అలాంటి అవకాశాలు అయితే దక్కలేదని భూమిక చెప్పుకొచ్చారు.
నాకు థ్రిల్లర్ సినిమాలలో( Thriller Movies ) నటించడం అంటే ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
యాక్షన్ సినిమాలకు సైతం నా వంతు న్యాయం నేను చేస్తానని భావిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.
డాకు మహారాజ్ సినిమా 200 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేస్తుందా..?