పోతిరెడ్డి పల్లె – వెంకటాపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ..

పోతిరెడ్డి పల్లె - వెంకటాపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ.

బ్రిడ్జి కి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోతిరెడ్డి పల్లె మాజీ సర్పంచ్ కనకట్ల బాలయ్య పేరు నామకరణం.

బ్రిడ్జి నిర్మాణానికి.90 లక్షలు.

ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా :దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు( Public Welfare Schemes ) ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండదండగా నిలువాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి 90 లక్షల రూపాయలు మంజూరు కాగా అట్టి నిధులతో నిర్మించనున్న బ్రిడ్జికి ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట అగయ్య మంగళవారం భూమి పూజ చేశారు.

ఈసందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ పోతురెడ్డిపల్లె గ్రామం చుట్టూ దట్టమైన అడవి వెంకటాపూర్ నుండి ఎత్తు వంతల గుంతలు పడిన నాలుగు గజాల మట్టి రోడ్డు ఉండేది.

వర్షం పడితే రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం ఏర్పుడుతుండేది.అప్పటి సర్పంచ్ కనకట్ల బాలయ్య ఈ విషయాన్ని పలుమార్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంకటాపురం నుండి పోతిరెడ్డిపల్లి , పోతిరెడ్డిపల్లి నుంచి మల్కపేట , దర్మారం రెండు రోడ్లు బీటి రోడ్డు మంజూరు కాగా రోడ్లు నిర్మించుకొవడం జరిగిందన్నారు.

దీంతో పోతిరెడ్డిపల్లె( Pothireddypally ) గ్రామానికి మంచి రోడ్డు సౌకర్యం కలిగిందన్నారు.ఇట్టి బ్రిడ్జి కి మాజీ సర్పంచ్ కనకట్ల బాలయ్య పేరు నామకరణ చేయనున్నట్లు ఆగయ్య ప్రకటించారు.

గ్రామంలో ఫోన్లు పనిచేయడం లేదని గ్రామస్తులు చాలా కాలంగా విజ్ఞప్తి చేయగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ( KTR )అక్కడ సెల్ టవర్ మంజూరు చేశారని దీంతో ఆ గ్రామానికి సమాచార వ్యవస్థను మెరుగుపరిచారని మెరుగుపరిచిన ఘనత కేటీఆర్ దే అని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లెలన్నీ గననీయంగా అభివృద్ధి చెందాయని రైతు సంక్షేమ కోసం వ్యవసాయరంగానికి నిరంతరం మెరుగైన కావాల్సినంత ఉచిత విద్యుత్ సరఫరా , రైతుబంధు , ఐదు లక్షల ఇన్సూరెన్స్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు ను త్వరితగతిన నిర్మించి మెట్ట ప్రాంతాలకు నీరు లేని ప్రాంతాల రైతులకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దన్నారు.

రాష్ట్రంలో పాఠశాలల అబివృద్ధి , రోడ్ల అభివృద్ధి, కరెంటు సరఫరా మెరుగుపరచడానికి విద్యుత్తు సబ్స్టేషన్లు నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేసి ఇంత మంచి అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించి దీవించవలసిన అవసరం ఎంతైనా ఉందనీ మంచి కార్యక్రమాలను చేస్తున్న వారిని ప్రోత్సహిస్తే మళ్లీ రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే మరింత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఘన్నమనేని లక్ష్మణరావు, ఉపసర్పంచ్ కనకట్ల వెంకయ్య , వెంకటాపురం సర్పంచ్ కోలా అంజమ్మ నరసయ్య, ఎంపీటీసీ సభ్యులు మామిళ్ల తిరుపతి , సెస్ డైరెక్టర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎ ఎం సి చైర్మన్ ఎల్సాని మోహన్ కుమార్ యాదవ్,ఎ ఏం సి మాజీ చైర్మన్ అందె సుభాష్ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , ఎఎంసి డైరెక్టర్ మెండె శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చీటీ రామారావు, ఎలగందుల నరసింహులు, మునిగే రాజు , ‌గ్రామ శాఖ అధ్యక్షులు కనకట్ల తిరుపతి, సోషల్ మీడియ ప్రతినిధి ఘన్నమనేని సుధాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధాకర్ , చెన్నమనేని పరశురాములు , సతీష్ నెమలికొండ నరేష్, కనకట్ల సతీష్ , అంబటి మల్లయ్య , చెన్నమనేని ప్రభాకర్ , శ్రీనివాసరావు జెల్ల ప్రశాంత్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మూడు తరాల నమ్మకం అంటున్న ఎన్టీఆర్!