భాగమతి హిందీ రీమేక్ కూడా ఓటీటీలోనే రిలీజ్
TeluguStop.com
అనుష్క ప్రధాన పాత్రలో బాహుబలి తర్వాత తెరకెక్కిన చిత్రం భాగమతి.జి.
అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లేడీ ఒరియాంటెడ్ కథాంశంతో తెరపై ఆవిష్కరించారు.
సుమారు 30 కోట్ల భారీ బడ్జెట్ తో కేవలం అనుష్క ఇమేజ్ మీద ఉన్న నమ్మకంతో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.
ఇక రిలీజ్ తర్వాత నిర్మాతల అంచనాలకి తగ్గట్లే సినిమా అద్భుతం విజయం సొంతం చేసుకొని అనుష్క కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అరుంధతి సినిమా తర్వాత మరోసారి అలాంటి పవర్ ఫుల్ పాత్రలో అనుష్క ఈ సినిమాలో నటించి మెప్పించింది.
సినిమా ఏకంగా అరవై కోట్లకిపైగా కలెక్ట్ చేసింది.కంటెంట్, స్క్రీన్ ప్లే బేస్ మీద నడిచే ఈ కథాంశం నచ్చడంతో అక్షయ్ కుమార్ నిర్మాతగా మారి ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేశారు.
ఇక ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన జి.అశోక్ బాలీవుడ్ రీమేక్ కి కూడా దర్శకుడుగా పని చేశారు.
అనుష్క చేసిన భాగమతి పాత్రని హిందీలో భూమి పడ్నేకర్ పోషించింది.దుర్గావతి టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.
అక్షయ్ కుమార్ తన లక్ష్మి బాంబ్ సినిమాని ఇప్పటికే డిజిటల్ రిలీజ్ కోసం అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నారు.
భారీ ఆఫర్‌తో ఈ చిత్ర రిలీజ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికారిక రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.భూమి పడ్నేకర్‌తో పాటు జిషు సేన్‌గుప్తా, అర్షద్ వాసి, మహి గిల్ తదతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
దుర్గావతితో పాటు భూమి పడ్నేకర్ నటించిన మరో మూడు సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ కాబోతుండటం విశేషం.
కాలేజీ కూడా కంప్లీట్ చేయని మహిళ ప్రతినెలా రూ.15 లక్షలు సంపాదిస్తోంది.. ఎలాగంటే..?