భూమా దంపతుల విగ్రహాల ఓపెనింగ్ లో వివాదాలు..
TeluguStop.com
కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ బీజేపీ ఇంచార్జీ పీసీ భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.
ఫ్యాక్షనిజం వేరు రౌడీయిజం వేరు, నీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.విగ్రహాల విషయంలో మాకు తెలియకుండా దొంగతనంగా మీరు ఓపెన్ చేయడంతో బాధపడ్డాము.
మా పెద్దాయన నారాయణ రెడ్డి గారితో భూమా దంపతులు విగ్రహాలను ఓపెన్ చేయాలనుకుంటే మాకు తెలియకుండా చిన్న పిల్లలు దొంగతనంగా చాక్లెట్ లాక్కొని పారి పోయినట్లు మీరు విగ్రహాలను ఆవిష్కరించి పరిగెత్తారు.
నేను మా అభిమానులకు నచ్చజెప్పాను, లేదంటే అక్కడ అనుకోని సంఘటనలు జరిగి ఉంటే ఎలా.
నా స్థలంలోకి వచ్చినట్లు ఇతర స్థలాల్లోకి వెళితే మిమ్మల్ని కొడతారు.నీ లాంటి వ్యక్తిని ఆంధ్ర ప్రజలు రెండు సంవత్సరాలుగా మంత్రిగా ఎలా భరించారు.
ఏవీ సుబ్బారెడ్డి గారు టిడిపిలోకి రమ్మని ఆయన ఉద్దేశంగా చెప్పారు.నేను ఎక్కడికి వెళ్ళను బిజెపిలోనే ఉంటా.
ఎవరిని ఏ స్థాయిలో పెట్టాలన్నది ప్రజలకు తెలుసు.
టీ, కాఫీలకు బదులు డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ ను తాగితే వెయిట్ లాస్ గ్యారెంటీ!