ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అబివృద్ధి పనులకు భూమి పూజ

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అబివృద్ధి పనులకు భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన 17 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్( MPP Pilli Renuka Kishan ),జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , ఎంపిటిసి సభ్యురాలు ఎలగందుల అనసూయ నర్సింలు,శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఎంపీడీవో సత్తయ్య లు కలిసి మంగళవారం భూమి పూజ చేశారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అబివృద్ధి పనులకు భూమి పూజ

సద్ది మద్దుల వాడలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించే మురికికాలువ నిర్మాణానికి,అదేవిధంగా హోటల్ చవాన్ ఇంటి నుండి సాయిబాబా గుడి మెయిన్ రోడ్డు వరకు 5 లక్షలతో నిర్మించే మురికి కాలువ నిర్మాణానికి , కిష్టంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వెనుక 16 లక్షల 85 వేల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాని( Govt Health Sub-centre )కి భూమి పూజ చేశారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అబివృద్ధి పనులకు భూమి పూజ

రాచర్ల గొల్లపల్లి అంబేద్కర్ వాడలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న మురికి కాలువకు భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, మహిళా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు ఆకుల లత,మాజీ ఎంపీటీసీ సభ్యులు ఓగ్గు బాలరాజు యాదవ్, మాజీ ఉపసర్పంచ్ ఓగ్గు రజిత యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ చేపూరి రాజేశం గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, సూడిద రాజేందర్, బానోత్ రాజు నాయక్, గిరిధర్ రెడ్డి, రవి ,గంట బుచ్చాగౌడ్, గుర్రం రాములు, గంట ఆంజనేయులు గౌడ్, బండారి బాల్ రెడ్డి,మెగి నర్సయ్య , రఫీక్ , పందిర్ల సుధాకర్ గౌడ్, అంతేర్పుల గోపాల్, కనకరాజు, చందు, రాజు యాదవ్, శ్రీనివాస్, హార్జా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అమెరికా నుంచి భారతీయ విద్యార్ధిని స్వీయ బహిష్కరణ.. ఏమైంది?

అమెరికా నుంచి భారతీయ విద్యార్ధిని స్వీయ బహిష్కరణ.. ఏమైంది?