రాకరాక హిట్ వస్తే పాపం బాలీవుడ్ కి ఇలా జరిగిందేంటి?

మన సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.

కానీ ఇప్పుడు అలా కాదు.మన రేంజ్ మారిపోయింది.

ఇంతకు ముందులా మన సినిమాలను చిన్న సినిమాలుగా కూడా చూడడం లేదు.బాహుబలి తో మొదలైన మన సినీ ప్రయాణం అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ నే శాసించే స్థాయికి వచ్చింది.

ఆర్ ఆర్ ఆర్ తో జక్కన్న చేసిన మ్యాజిక్ తగ్గకుండానే వరుసగా మన సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అవుతూ అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులంతా సౌత్ సినిమాల మాయలో పడిపోయారు.పుష్ప నుండి మొదలైన సౌత్ మ్యానియా ఇప్పటికి తగ్గడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతుంది.

పుష్ప తర్వాత రెండో రోజు అలియా గంగూబాయి రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.

ఇక ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.రిలీజ్ అయినా అన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి.

ఇక ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఒక హిట్ మళ్ళీ పలకరించింది అని ఆనందపడే లోపు వారి ఆనందం అక్కడే ఆవిరి అయ్యింది.

అక్షయ్ కుమార్ హీరోగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ సినిమా భూల్ భూలయ్య 2.

ఈ సినిమాకు బాగా హైప్ వచ్చింది.రిలీజ్ ముందు నుండే అంచనాలు నెలకొన్నాయి.

65 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా వారాంతంలో విడుదల అయ్యింది.

చాలా కాలం తర్వాత ఈ సినిమా రూపంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ హిట్ దక్కింది.

ఇక ఈ సినిమా రోజుకు 20 కోట్లు వసూళ్లు చేస్తూ వీకెండ్ నాటికే సేఫ్ అవుతుంది అని అంతా అనుకున్నారు.

"""/"/ ఇలా చక్కని హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమాకు పైరసీ పంచ్ పడింది.

ఈ సినిమా పూర్తి హెచ్ డి డౌన్లోడ్ కోసం ఆన్ లైన్ లో లింక్స్ అందడం షాక్ కు గురి చేస్తుంది.

మే 20న రిలీజ్ అయినా భూల్ భూలయ్య 2 పై నెటిజెన్స్ క్రేజీ గా ఉనాన్రు.

ఈ క్రమంలో పైరసీ ఈ సినిమా నిర్మాతలకు బ్యాడ్ న్యూస్ గా మారింది.

ఈ సినిమా తమిల్రాకర్స్, టెలిగ్రామ్, మూవీరూల్జ్ లో పైరసీ అందుబాటులోకి వచ్చింది.ఇలా రావడంతో వచ్చిన హిట్ కూడా దక్కకుండా పోతుంది.

పైరసీ అనేది ఏ సినిమాకు అయినా నష్టమే మిగులుస్తుంది.ఇటీవల కాలంలో పైరసీ ఎక్కువ అవుతుంది.

దీనిని ముందు ముందు అయినా అరికట్టాలి అని కోరుకుందాం.

ఝార్ఖండ్ లో ఈడీ సోదాలు.. భారీగా నగదు పట్టివేత