బిగ్ బాస్ ఓటింగ్ లైన్ లో అమర్ దీప్ ని దాటేసిన భోలే శవాలీ గ్రాఫ్..ఇదేమి ట్విస్ట్ సామీ!

ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎంత రసవత్తరంగా సాగుతూ దూసుకెళ్ళిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా నామినేషన్స్ ప్రక్రియ లో పెద్ద యుద్ధమే జరిగింది.అలా హీట్ వాతావరణం లో జరిగిన ఈ నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినా ఇంటి సభ్యులు అమర్ దీప్, భోలే శవాలీ, గౌతమ్, అశ్వినీ , పూజా మూర్తి , టేస్టీ తేజా , పల్లవి ప్రశాంత్.

నిన్న జరిగిన నామినేషన్స్ లో భోలే శవాలీ తో( Bhole Shavali ) శోభా శెట్టి మరియు ప్రియాంక ఏ రేంజ్ లో గొడవ పడ్డారో మనమంతా చూసాము.

ఈ గొడవలో తప్పు ముమ్మాటికీ భోలే శవాలీదే.ఈ సంఘటన కచ్చితంగా ఆయనకీ పెద్ద మైనస్ అవుతుంది ఏమో అని అందరూ అనుకున్నారు.

సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

"""/" / కానీ ఓటింగ్ లైన్ లో ఇతను ఈ వారం పల్లవి ప్రశాంత్( Pallavi Prasanth ) తర్వాత అత్యధిక ఓట్లను దక్కించుకొని టాప్ 2 స్థానం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇది తెలుసుకున్న నెటిజెన్స్ అసలు ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని అంటున్నారు.

పల్లవి ప్రశాంత్, భోలే శవాలీ వీళ్లంతా ముందుగా టాప్ ఏజెన్సీలతో మాట్లాడుకొని హౌస్ లోకి అడుగుపెట్టారా?, అందుకే లోపల జరుగుతున్న సంఘటనలకు పూర్తి భిన్నంగా వీరికి ఓటింగ్( BB7 Voting ) జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదంతా కాకుండా ఇద్దరు ఆడవాళ్లు కలిసి ఒక వ్యక్తి మీద టార్గెట్ చెయ్యడం వల్లే ఓటింగ్ శాతం భోలే కి అనుకూలంగా మారడానికి కారణం అయ్యిందా అనేది అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

భోలే ని ఇద్దరు ఆడవాళ్లు టార్గెట్ చేసారని జనాలు అనుకుంటే, నామినేషన్స్ చెయ్యడానికి వచ్చిన ప్రతీ ఒక్కరిని భోలే వెక్కిరించినా విషయాన్నీ జనాలు చూడలేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

"""/" / అతను రెచ్చగొట్టే ధోరణి తో ఉండడం వల్లే ప్రియాంక( Priyanka ) మరియు శోభా శెట్టి( Sobha Shetty ) ఆ విధంగా అతనితో ప్రవర్తించారు.

ఈ విషయం ఎవ్వరూ గమనించడం లేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

అయితే భోలే నిన్న బూతులు మాట్లాడినప్పుడు బిగ్ బాస్ నుండి వార్నింగ్ రావడం తో అతను కాస్త మెత్తపడ్డాడు అనే చెప్పాలి.

రాత్రి పడుకునే ముందు ఆయన శోభా శెట్టి మరియు ప్రియాంక ఇద్దరికీ కూడా క్షమాపణలు చెప్తాడు.

ఇదంతా చూసిన తర్వాతే జనాలు అతనికి ఓట్లు వేశారని అంటున్నారు మరికొంతమంది.చూద్దలి మరి రాబొయ్యే రోజుల్లో భోలే ప్రవర్తన ఎలా ఉండబోతుంది అనేది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?