భోళా నుండి ‘జామ్ జామ్ జజ్జనక’ సాంగ్ రిలీజ్.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ ఖాయం!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వరుసగా రెండు హిట్స్ అందుకున్న తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''భోళా శంకర్''.
( Bhola Shankar ) చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
ఇప్పటికే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బోణీ కొట్టిన చిరు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
"""/" /
రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఆకట్టుకోగా ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
ఇది మరింతగా అలరిస్తుంది.ఇది మంచి సెలెబ్రేషన్ సాంగ్ అని మేకర్స్ ముందుగానే చెప్పారు.
"""/" /
చెప్పినట్టుగానే ఈ సాంగ్ అదిరిపోయింది.కొద్దీ సేపటి క్రితమే ''జామ్ జామ్ జజ్జనక''( Jam Jam Jajjanaka ) అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.
ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అనే చెప్పాలి.ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను రిలీజ్ అవ్వగా ఇది మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరిని మెప్పిస్తుంది.
కాగా ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.చూడాలి ఎలా అలరిస్తుందో.