రెండో రోజుకే చేతులెత్తేసిన భోళా శంకర్.. బుకింగ్స్ మరీ ఘోరంగా ఉన్నాయంటూ?
TeluguStop.com
ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమాలలో మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఏవనే ప్రశ్నకు ఏజెంట్, భోళా శంకర్ సినిమా పేర్లు వినిపిస్తున్నాయి.
రొటీన్ మాస్ మసాలా మూవీ అయిన వేదాళం సినిమాను చిరంజీవి రీమేక్ చేస్తానని చెప్పిన సమయంలోనే మెజారిటీ ఫ్యాన్స్ చిరంజీవి నిర్ణయం సరైన నిర్ణయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మెహర్ రమేష్( Meher Ramesh ) ను ఈ సినిమాకు దర్శకునిగా ఎంపిక చేసి మరో తప్పు చేశారు.
"""/" /
శక్తి, షాడో సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహించని డిజాస్టర్లు ఇచ్చిన మెహర్ రమేష్ చిరంజీవి( Chiranjeevi ) సినిమా విషయంలో ఆ పొరపాట్లు చేయడని అందరూ అనుకున్నారు.
మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ బంధువు కావడంతో మెహర్ రమేష్ కు ఈ సినిమాకు పని చేసే అవకాశం సులువుగానే దక్కింది.
అయితే భోళా శంకర్( Bhola Shankar ) మూవీ రెండో రోజుకే చేతులెత్తేసింది.
హైదరాబాద్ లో చాలా థియేటర్లు ఖాళీగా ఉండటం గమనార్హం. """/" /
భోళా శంకర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండగా సెకండ్ డే కలెక్షన్లు మాత్రం తక్కువగానే ఉండనున్నాయని తెలుస్తోంది.
భోళా శంకర్ మూవీ టైర్2, టైర్3 ఏరియాలలో చిరంజీవి పరువు తీసేలా కలెక్షన్లను సాధిస్తోంది.
ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు తక్కువగానే ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి లాంటి స్టార్ హీరో నటించాల్సిన సినిమా కాదని ఇలాంటి కథలను ఎంచుకోకుండా మంచి కథలను ఎంచుకుంటే చిరంజీవి కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
భవిష్యత్తు సినిమాల కథ, కథనాల విషయంలో చిరంజీవి జాగ్రత్త పడాల్సి ఉంది.జబర్దస్త్ కమెడియన్లలో చాలామంది భోళా శంకర్ సినిమాలో నటించగా ఎవరికీ సరైన పాత్ర పడలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?