భోళా శంకర్ మెయిన్ హైలెట్స్ ఇవే.. ఈసారి హిట్ పక్కానే!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో 'భోళా శంకర్'( Bhola Shankar Movie ) ఒకటి.

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు భారీ సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.

అందుకే ఫుల్ ఫోకస్ తో తన నెక్స్ట్ సినిమా భోళా శంకర్ ను పూర్తి చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్( Meher Ramesh ) డైరెక్ట్ చేస్తున్నాడు.

రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా మెహ రమేష్ చేస్తున్నారు.

మరి మెహర్ రమేష్ ఈ సినిమాను ఎన్ని హైలెట్స్ తో తెరకెక్కిస్తున్నాడో ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో హైలెట్స్ ను ఒక్కసారి పరిశీలిస్తే. """/" / ఈ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ అదిరే లెవల్లో ఉంటుందని.

ముఖ్యంగా మెగాస్టార్ - వెన్నెల కిషోర్ - హైపర్ ఆది - సత్య మధ్య సాగే కామెడీ ట్రాక్ మెయిన్ హైలెట్ గా నిలుస్తాయట.

ఈ సీన్స్ చూసే మెగా ఫ్యాన్స్ కు వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.

అంతేకాదు మెహర్ రమేష్ చిరును తన కెరీర్ లో ఎవ్వరు ఇంత వరకు చూపించని డిఫరెంట్ లుక్ లో చూపించ నున్నారట.

కథలోని మెయిన్ ఎమోషన్స్ అన్నిటిని మెహర్ రమేష్ అద్భుతంగా తెరకెక్కించారని అన్ని సీన్స్ అద్భుతంగా వచ్చాయని అంటున్నారు.

మరి మెహర్ రమేష్ చిరును ఎంత కొత్తగా స్టైలిష్ గా చూపిస్తాడో చూడాలి.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అలాగే ఈ సినిమాలో అక్కినేని యువ హీరో సుశాంత్ కూడా కీలక రోల్ పోషిస్తున్నాడు.

మరి ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. ఈ నటిని గుర్తు పట్టారా?