‘భోళా మ్యానియా’కు అద్భుతమైన స్పందన.. అప్పుడే అన్ని మిలియన్ వ్యూస్!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'( Bhola Shankar ).

అందరి అంచనాలను నిలబెట్టుకునేలా మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ భోళా నుండి ఫస్ట్ సింగిల్ ను నిన్న రిలీజ్ చేసారు.

'భోళా మ్యానియా'( Bhola Mania ) సాంగ్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది.

ఇప్పటికే ఈ సాంగ్ 12 గంటల్లోనే 3 మిలియన్ వ్యూస్ అందుకుంది.మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.

భోళా మ్యానియాతో మెగాస్టార్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసాడు.మరోసారి మెగాస్టార్ తన స్టెప్పులతో అలరిస్తున్నాడు.

"""/" / ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.తమిళ్ లో అజిత్ ( Ajith )నటించిన వేదాళం సినిమాకు అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే.

సుశాంత్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, శ్రీముఖి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

"""/" / ఇక ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ ల తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా ఈ సినిమాతో మెగాస్టార్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా ఆశ పడుతున్నారు.

రీమేక్ సినిమా అయినప్పటికీ అన్ని హంగులతో ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తూ మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ రెడీ చేస్తున్నాడు.