కొత్త సంవత్సరంలో హిందూ ప్రజలు జరుపుకునే మొట్టమొదటి తెలుగు పండుగ సంక్రాంతి పండుగ.
ఈ పండుగను నాలుగు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.భోగితో మొదలైన ఈ పండుగ మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులపాటు ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం మకర సంక్రాంతి రోజు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ఇక భోగితో మొదలైన ఈ పండుగ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎంతో అందమైన రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఈ పండుగను చేసుకుంటారు.
అదే విధంగా భోగి రోజు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలపై భోగి పళ్ళు వేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా పిల్లలపై బోగిపళ్ళు పోస్తూ ఉంటారు.
అయితే భోగిపళ్ళు పోయడానికి కూడా ఒక నియమం ఉంది.భోగిపళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరైన సమయంలోనే భోగిపళ్లు పోయాలని పండితులు చెబుతున్నారు.
మరి భోగి పళ్ళు పిల్లలపై ఎప్పుడు పోయాలి అనే విషయానికి వస్తే.ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా సంక్రాంతి రోజు భోగిపళ్ళు పోయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే.
"""/"/ అయితే ఈ భోగిపళ్ళను సూర్యాస్తమయ సమయంలో మాత్రమే పోయాలని పండితులు చెబుతున్నారు.
సూర్యాస్తమయ సమయంలో పిల్లలకు శుభ్రంగా స్నానం చేయించి వారిని తూర్పు వైపుకు కూర్చోపెట్టి భోగి పళ్ళను పోయాలి.
భోగి పళ్ళతో పాటు పువ్వులు, నాణేలు, కలిపిపోయడం ఆనవాయితీ.భోగి పళ్ళను కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారిని పిలిచి వారితో పోయించడం ఎంతో మంచిదని చెప్పవచ్చు.
అయితే సూర్యాస్తమయ సమయంలో మాత్రమే భోగిపళ్ళు పోయడం ఎంతో ఉత్తమం అని పండితులు చెబుతున్నారు.