ప్రజలకు బంపరాఫర్.. బంగారు నాణం ఫ్రీ.. ఇలా పొందండి!

హిందువులు, జైనులు జరుపుకునే వార్షిక వసంతకాలపు పండుగ అక్షయ తృతీయ.( Akshaya Tritiya ) ఈ పండుగ హిందూ మాసం వైశాఖ అంటే సాధారణంగా ఏప్రిల్ లేదా మేలో వస్తుంది.

ఈ రోజున ప్రారంభించిన శుభకార్యాలు లేదా కొత్త పనులు విజయవంతం అవుతాయని నమ్ముతారు.

అందువల్ల, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం, గృహాలు లేదా భవనాల నిర్మాణాలను ప్రారంభించడానికి శుభ దినంగా పరిగణిస్తారు.

ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది.ఆ రోజున బంగారు నగలు( Gold Ornaments ) కొనుగోలు చేయడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు.

ఏటా అక్షయ తృతీయ నాడు బంగారు నగల సేల్స్‌ ఆకాశాన్నంటుతాయి.ఈ శుభదినం నాడు బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని ప్రజలు నమ్మడమే ఇందుకు కారణం.

నేడు కనీసం ఒక గ్రాము బంగారమైనా కొంటుంటారు.ఏడాది మొత్తంలో గోల్డ్‌కి ఏ రోజూ లేని డిమాండ్ అక్షయ తృతీయ నాడే ఉంటుంది కాబట్టి కస్టమర్లను ఆకట్టుకోవడానికి నేడు జ్యువెలరీ షాపులు ఒకదానికొకటి పోటీగా ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి.

"""/" / ఇందులో భాగంగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ భీమా జ్యువెలర్స్( Bhima Jewellers ) గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇచ్చేస్తామని బంపరాఫర్ ప్రకటించింది.

అక్షయ తృతీయ రోజు ప్రజలకు అడ్వాన్స్ బుకింగ్‌ సదుపాయాన్ని భీమా జ్యువెలర్స్ తీసుకొచ్చింది.

కస్టమర్స్ రూ.1,000 చెల్లించి నగలు బుక్‌ చేసుకోవచ్చు.

అయితే రూ.75 వేలకు పైన విలువైన నగలు కొనేవారికి గోల్డ్ కాయిన్‌ను ఫ్రీగా అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

ఈ ఆఫర్‌ను ఏప్రిల్ 18లోగా సద్వినియోగం చేసుకోవచ్చు. """/" / ఆపై అంటే ఏప్రిల్ 20-23 మధ్య కాలంలో అన్ని భీమా జ్యువెలర్స్ స్టోర్స్‌లో ఒక గ్రామ్ గోల్డ్‌పై రూ.

650 డిస్కౌంట్ అందుకోవచ్చు.పాత బంగారం ఎక్స్‌ఛేంజ్ చేసేవారు ఒక్కో గ్రాముకు రూ.

100 అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.డైమెండ్ జ్యువెలరీ కొనేవారు ఫ్రీగా 2 గోల్డ్ కాయిన్స్, రూ.

7,500 డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.ఆన్‌లైన్‌లో షాపింగ్‌లోనూ భీమా జ్యువెలర్స్ ఆఫర్స్ ప్రకటించింది.

ఈ సంస్థ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రూ.10 వేలకు పైగా ఆర్డర్స్‌పై రూ.

1,000 డిస్కౌంట్ పొందొచ్చు.ఇక రూ.

25 వేల కంటే ఎక్కువ ఆర్డర్స్‌పై గోల్డ్ కాయిన్ ఉచితం.ఈ ఆఫర్ ఏప్రిల్ 23 వరకు వర్తిస్తుంది.

ఇకపోతే భీమా జ్యువెలర్స్ కంపెనీ రీసెంట్‌గా తమిళనాడులోని హోసూర్ టౌన్‌లో కొత్త జ్యువెలరీ స్టోర్‌ను ప్రారంభించింది.

దీనితో కర్నాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో మొత్తం 17 స్టోర్స్ అయ్యాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్17, మంగళవారం 2024