ఏప్రిల్ 27న నితిన్ సినిమా రిలీజ్

యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న నితిన్ తన నెక్ట్స్ మూవీ ‘రంగ్‌దే’ను శరవేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

అయితే నితిన్ నటించిన సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.నితిన్ భీష్మ తరువాత మరో సినిమా ఎప్పుడు చేశాడు.

? ఆ సినిమాను ఇప్పుడు రీలీజ్ చేయడం ఏమిటి అనుకుంటున్నారు.నితిన్ నటించిన భీష్మ చిత్రాన్ని డిజిటిల్ ప్లాట్‌ఫాం సన్ నెక్ట్స్‌పై ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు వెంకీ కుడుముల తెలిపాడు.

ప్రస్తుతం థియేటర్లు మూసివేయడంతో భీష్ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దర్శకుడు వెంకీ కుడుముల ఈ సమాధానం ఇచ్చాడు.

మొత్తానికి ఏప్రిల్ 27న భీష్మ చిత్రాన్ని ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో చూసేయొచ్చని ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.