భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్.. మాస్‌కు ఫోక్ తోడయితే అంతే!

ఎప్పుడెప్పుడా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రానే వచ్చేసింది.

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న భీమ్లా నాయక్ చిత్రంతో పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో పవన్‌తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

కాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఈ అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఇక పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ కొద్ది క్షణాల ముందు రిలీజ్ చేశారు.

ఈ టైటిల్ సాంగ్‌తో మరోసారి థమన్ తన సత్తా చాటాడని చెప్పాలి.పవన్ కళ్యాణ్ లాంటి పవర్‌ఫుల్ హీరో పాత్రను ఎలివేట్ చేసే లిరిక్స్‌కు తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను అదరగొట్టాడు థమన్.

ముఖ్యంగా పాట స్టార్టింగ్‌లో వచ్చే ఫోక్ లిరిక్స్ ఈ పాటకు ప్రాణం అని చెప్పాలి.

భీమ్లా నాయక్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించే రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అదిరిపోయాయని చెప్పాలి.

థమన్, రామ్ మిరియాల, శ్రీకృష్ణ పృథ్వీ చంద్ర ఈ పాటను పాడిన విధానం పవన్ ఫ్యాన్స్‌నే కాకుండా కామన్ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకునే విధంగా ఉంది.

మొత్తానికి ఈ పాట పవన్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉందనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మనకు కనిపించనున్నాడు.

అటు రానా దగ్గుబాటి పాత్ర కూడా ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన డైలాగ్స్‌తో మరోసారి మ్యాజిక్ చేయనున్నాడు.

సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను మీరు కూడా ఓసారి చూసేయండి.

వైరల్ వీడియో: ఇదేందయ్యా ఇది.. ఇంత పెద్ద దండ ఎప్పుడు చూడలే..