భీమ్లా నాయక్‌ తో ప్రభాస్‌ జక్కన్నల్లో ఎవరికి నష్టం?

కరోనా వల్ల గత ఏడాది కాలం నుండి చాలా సినిమాలు వాయిదాలు పడుతూ వచ్చాయి.

వచ్చే సంక్రాంతి కి సినిమాలు వరుసగా రాబోతున్నాయి.టాలీవుడ్‌ లో సంక్రాంతికి భారీ ఎత్తున సినిమాలు రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలను వాయిదా వేయించేందుకు ప్రయత్నాలు చేశారు.ఆ ప్రయత్నాల్లో భాగంగా సర్కారు వారి పాట సినిమా ను వాయిదా వేయించగలిగారు.

కాని భీమ్లా నాయక్ సినిమాను మాత్రం వారు వాయిదా వేయించలేక పోతున్నారు.చాలా మంది భీమ్లా నాయక్‌ సినిమా ను వాయిదా వేయించేందుకు ప్రయత్నించారట.

కాని పవన్ మూవీ మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా రాబోతుంది.భారీ అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి కి విడుదల కాకుండా జక్కన్న ప్రయత్నించాడట.

కాని ఆ తేదీ తప్ప మరే డేట్‌ అందుబాటులో లేక పోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సంక్రాంతికి భీమ్లా నాయక్‌ విడుదల అవ్వడం వల్ల ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా మరియు రాధేశ్యామ్‌ సినిమా ల్లో ఏ సినిమా కు నష్టం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

"""/" / ఈ రెండు సినిమా ల్లో భీమ్లా నాయక్‌ కు క్లోజ్ గా వచ్చేది రాధేశ్యామ్‌ .

కనుక ఆర్‌ ఆర్‌ ఆర్‌ కంటే ఎక్కువ నష్టం ఖచ్చితంగా రాధేశ్యామ్‌ కే అంటున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న రాధేశ్యామ్‌ తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్‌ వల్ల కాస్త నష్టపోయినా దేశంలో ఇతర ప్రాంతాల్లో భారీ గా ఈ సినిమా వసూళ్లు దక్కించుకోవడం ఖాయం.

ఖచ్చితంగా మూడు సినిమా లు కూడా పోటీ పడటం వల్ల ఎంతో కొంత నష్టం తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై తీర్పు రిజర్వ్