ఏడడుగులు వేసిన భీమ్లా నాయక్ బ్యూటీ మౌనిక.. ఎవరెవరు హాజరయ్యారంటే?

ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన భీమ్లా నాయక్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించింది.

ఈ సినిమాలో నటించిన మౌనికా రెడ్డి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

కొన్నిరోజుల క్రితం సందీప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని శుభవార్త చెప్పిన మౌనికా రెడ్డి వివాహం ఈ నెల 17, 18 తేదీలలో గోవాలో గ్రాండ్ గా జరిగింది.

సందీప్ మౌనికల జోడీ బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ వివాహ వేడుకకు సెలబ్రిటీలను ఎక్కువగా ఆహ్వానించలేదని సమాచారం అందుతోంది.

ప్రముఖ యాంకర్లలో ఒకరైన వర్షిణి ఈ వివాహ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

మౌనిక క్లోజ్ ఫ్రెండ్స్ లో వర్షిణి ఒకరు కావడంతో ఆమె ఈ పెళ్లికి హాజరయ్యారని తెలుస్తోంది.

మరోవైపు మౌనికా రెడ్డి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. """/"/ లఘుచిత్రాలతో కెరీర్ ను మొదలుపెట్టి సూర్య వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన మౌనికా రెడ్డి ఆ వెబ్ సిరీస్ వల్ల సినిమా ఆఫర్లను సైతం సొంతం చేసుకుంటున్నారు.

భీమ్లా నాయక్ బ్యూటీ మౌనికా రెడ్డి రాబోయే రోజుల్లో కూడా సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

"""/"/ వరుసగా మూవీ ఆఫర్లు వస్తున్న సమయంలో మౌనిక పెళ్లిపై దృష్టి పెట్టడం గమనార్హం.

మౌనిక పెళ్లి ఫోటోలను చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆమె భర్తతో కలిసి కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.

మౌనికా రెడ్డికి రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఆఫర్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

మౌనికా రెడ్డి కెరీర్ విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే.. కుంభస్థలం బద్దలుగొడతారా?